MP Vemireddy Prabhakar Reddy Resigned to YSRCP : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవినీ వదులుకున్నారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీకి చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్(CM Jagan)ను వేమిరెడ్డి కోరారు.
Nellore YSRCP Politics : రాష్ట్రంలో ఎన్నికల సమయం(AP Elections 2024) దగ్గరపడుతుండగా నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. ఊహించని మలుపులు తిరుగుతూ జిల్లాలోని రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే ఈ జిల్లాలో పలువురు కీలక నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరగా, తాజాగా వేమిరెడ్డి రాజీనామాతో వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
సీఎం జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన గతకొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వేమిరెడ్డి బాటలోనే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌తో పాటు మరికొందరు కార్పొరేటర్లు నడుస్తారని సమాచారం. ఎమ్మెల్యే అనిల్ కుమార్(MLA Anil Kumar)కు బాబాయ్‌గా పేరున్న రూప్ కుమార్ యాదవ్ పార్టీని వీడితే వైసీపీ కంచుకోటకు బీటలు వారినట్లేనని చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో నెల్లూరు జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి.
మీడియా ప్రతినిధులు, సంస్థలపై పగబట్టిన జగన్ - ఖండించిన నేతలు
'జగన్‌ను ఓడిస్తేనే సర్పంచులకు మనుగడ'- విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశం