TDP MP Candidate Vemireddy Prabhakar Reddy: తాము పార్టీ మారుతున్నామంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. ఇకనైనా వైసీపీ అసత్య ప్రచారాలు ఆపాలని హితవు పలికారు. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే తాము పార్టీ మారుతున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని వేమిరెడ్డి దంపతులు మండిపడ్డారు. తాము టీడీపీలోనే కొనసాగుతామని పునరుద్ఘాటించారు.
వైసీపీ తట్టుకోలేకపోతోంది: సోషల్ మీడియాలో ట్రోలింగ్ నమ్మవద్దు, మాకు తెలుగుదేశంలో ఎంతో గౌరవం ఉందని వేమిరెడ్డి దంపతులు వెల్లడించారు. తాము టీడీపీని వీడుతున్నట్లు ప్రచారాలుచేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధిగా, కోవూరు నియోజకవర్గ అభ్యర్ధిగా మా ఇద్దరికి ప్రజల్లో వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని వేమిరెడ్డి దంపతులు తీవ్రఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం తమను ఎంతో గౌరవిస్తుందని తెలిపారు. టీడీపీలో తాము ఉన్నతంగా ఉన్నామని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్ది మీడియా సమావేశంలో తెలిపారు. తాము టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారంచేయడం మంచిపద్దతికాదని చెప్పారు. ప్రజల ఆధరణ చూసి వైసీపీ తట్టుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. టీడీపీ చేరికలు చూసి ఇతర పార్టీల వారు అసూయా పడుతున్నారని వెల్లడించారు. టీడీపీ నేను, వీపీఆర్ ఘన విజయం సాధించనున్నామని తెలిపారు. మేమైతే ప్రజలకు న్యాయం చేయగలమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ను ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల కన్నా ముందే నెల్లూరులో వైసీపీ ఖాళీ !
ప్రజల్ని తప్పుదోవ పట్టించడాకే అసత్య ప్రచారాలు: రాబోయే ఎన్నికల్లో తాము టీడీపీ నుంచి ఖచ్చితంగా గెలుస్తామని, వేమిరెడ్డి దంపతులు ధీమా వ్యక్తం చేశారు. తమకు తెలుగుదేశంలో తగిన గౌరవం లబిస్తోందని తెలిపారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడాకి వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని పేర్కొన్నారు. తమకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లబిస్తుందని తెలిపారు. వైసీపీని వీడిన తరువాత తమపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయని తెలిపారు . తాము మంచి మెజార్టీతో తప్పకుండా గెలుస్తామని వేమిరెడ్డి దంపతులు ధీమా వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే సోషల్ మీడియాలో దాడులు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి - Kotamreddy Sridhar Reddy on YSRCP