ETV Bharat / politics

ఊపందుకున్న కూటమి ప్రచారం - సీఎం జగన్​ ఓటమే లక్ష్యంగా వ్యూహం - NDA Leaders Meeting in AP

NDA Leaders Meeting on Defeat CM Jagan in Elections: వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు ఎన్డీఏ కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మూడు పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

NDA_Leaders_Meeting_on_Defeat_CM_Jagan_in_Elections

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 5:57 PM IST

NDA Leaders Meeting on Defeat CM Jagan in Elections: రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్​ను ఓడించడమే లక్ష్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ముందుకు సాగుతోంది. ఇందుకు మూడు పార్టీల నేతలు సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా చోట్ల కూటమి నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ రహిత పాలన అందించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అంధకార రాష్ట్రంగా మారిన ఏపీలో మళ్లీ వెలుగులు తీసుకొచ్చేందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో పయనింపజేయాలన్నా, యువతకు ఉపాధి, విద్యావకాశాలను కల్పించాలన్నా ఈ కూటమికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. అవనిగడ్డలో జరిగిన కూటమి సభలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలన చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నవ్యాంధ్రా పునఃనిర్మాణం, ప్రజలలో రాష్ట్ర అభివృద్ధిపై భరోసా కల్పించడానికే ఈ కూటమి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడడానికే కూటమి సమష్టిగా పని చేస్తుందని అన్నారు.

పిచ్చోడి చేతిలో రాయి ప్రమాదకరమని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ పాలనపై దుమ్మెత్తి పోశారు. టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలు తన విజయానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమానికి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఎన్డీఏ కూటమి తొలి సభకు ముమ్మర ఏర్పాట్లు - 'ప్రజాగళం'గా పేరు ఖరారు

మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజును టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు భీమడోలు మండలం పొలసానిపల్లి నుంచి ద్వారకా తిరుమల వరకు భారీగా బైక్, కార్లతో ర్యాలీ నిర్వహించారు. మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన తన విజయానికి కూటమి నేతలంతా సహకరించాలని కోరారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో కూటమి అభ్యర్థి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా వెంకన్నను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పార్టీ కరపత్రాలు పంపిణీ చేసి స్థానికుల ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీని నమ్మి ఓటేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు ప్రజలకు నరకం చూపించారన్నారు. అక్కా చెల్లెమ్మలంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే జగన్ తల్లి, చెల్లిని ఇంటి నుంచి తరిమేసారని, పదవి కోసం కోడి కత్తి, బాబాయ్ మర్డర్ కార్యక్రమాలకు తెర తీసారని దుయ్యబట్టారు.

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.