Vizag Local Bodies MLC By Poll 2024 : ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూటమి తరపున అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు దాదాపు ఖరారైంది. ఆయన పేరును ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నాయకులు ప్రతిపాదించారు. ఈ మేరకు వారు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించనున్నారు. చక్రవర్తి మెట్రో మెడి అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
NDA Alliance Candidate Vizag MLC By Elections : విదేశాల్లోనూ బైరా దిలీప్ చక్రవర్తి వ్యాపారాలు నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నుంచి ఆయన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ పొత్తులో భాగంగా సీఎం రమేశ్‌కు టికెట్ దక్కింది. రమేశ్ గెలుపు కోసం దిలీప్ చక్రవర్తి పనిచేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 14న స్క్రూటినీ చేయనున్నారు. ఆగస్టు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.