Nara Lokesh Convoy Vehicles Searched several times : ఉండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేశారు. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి సోదాలు నిర్వహించారు. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేశ్‌కు చెప్పిన పోలీసులు కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేశారు. వాహనం దిగి లోకేశ్ తనిఖీలకు సహకరించారు.
వైసీపీ నేతల కార్లు మాత్రం తనిఖీ చేయడం లేదు: ఒకే రోజు రెండు సార్లు తన కాన్వాయ్ వాహనాల తనిఖీపై లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్ (Nara Lokesh) , వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. కేవలం టీడీీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న లోకేశ్ కాన్వాయ్ ను ఆపి తనిఖీలు నిర్వహించారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని స్పష్టం పోలీసులు నిర్దారించుకున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేశ్ ప్రచారం సాగుతోందని పోలీసు అధికారులు నిర్ధారించారు.
తనిఖీలపై స్పందించిన అచ్చెన్నాయుడు: గత మూడు రోజుల్లో నాలుగుసార్లు నారా లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేశ్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మార్చి 20 న ఉదయం 8 గంటలకు, 23న ఉదయం 8 గంటలకు, ఈరోజు ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8.10 కి, సాయంత్రం 5 గంటలకు లోకేశ్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారని, కేవలం లోకేశ్ వాహనాలను మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని నిలదీశారు. వైకాపా ముఖ్య నాయకుల కాన్వయ్‌లు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ మంగళగిరిలో జగన్ రెడ్డి బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నా ఎందుకు తొలగించలేదని ధ్వజమెత్తారు. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల పరంగా నడుచుకోవడం మానుకోవాలని హితవు పలికారు.
ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop
ఏపీ ఎన్నికలు 2024 - ఇవాళ సాయంత్రం టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా!
ఏపీలో ఎన్నికల ప్రచారంలో కూటమి దూకుడు - టీడీపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే!