ETV Bharat / politics

ఏపీలో నేడు ప్రధాని మోదీ పర్యటన - రాజమహేంద్రవరం, అనకాపల్లిలో బహిరంగ సభలు - PM MODI ELECTION CAMPAIGN IN AP

author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 9:36 AM IST

Modi Election Campaign in Andhra Pradesh: ఏపీ ఎన్నికల దృష్ట్యా ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఓటింగ్​ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. నేడు రెండు సభల్లో పాల్గొననున్నారు. మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్​ కల్యాణ్, నారా లోకేశ్​ హాజరవ్వనున్నారు.

AP Elections 2024
Modi Election Campaign (Etv Bharat)

ఏపీలో నేడు ప్రధాని మోదీ పర్యటన భద్రత కోసం 2,347 మంది పోలీసులు (Etv Bharat)

Modi Election Campaign in Andhra Pradesh : ఏపీలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి నేడు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. వీటికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. గోదావరి తీరంలో ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభకు కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానితో పవన్ కల్యాణ్​, లోకేశ్ ఈ సభలో పాల్గొనున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే మరో సభలో ప్రధాని మోదీతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు.

తెలుగుదేశం గతేడాది మహానాడు నిర్వహించిన మైదాన ప్రాంగణంలో సుమారు 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను సభలో ప్రధాని మోదీ వివరించనున్నారని నేతలు తెలిపారు. ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సభా ప్రాంగణంలో భారీ వేదికల చుట్టూ పందిళ్లు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో కూలర్లు, ఏసీలు అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం- ఆరు సభలు, హైదరాబాద్​లో రోడ్​ షో, షెడ్యూల్ ఇదే

సభకు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది తరలి రానున్నారని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా లోపాలు తలెత్తడం, పలువురు ఉన్నతాధికారులపై వేటు పడటంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 2,347 మంది పోలీసులను ప్రధాని సభ భద్రత కోసం కేటాయించారు. జాతీయ రహదారికి పక్కనే ప్రధాని సభ నిర్వహిస్తుండటంతో ఆ మార్గంలో వేరే వాహనాలు రాకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

అనకాపల్లి సభలో ప్రధానితో కలిసి పాల్గొననున్న చంద్రబాబు : మూడు గంటల 45 నిమిషాలకు రాజమహేంద్రవరంలో సభ ముగిసిన తర్వాత అనకాపల్లికి ప్రధాని పయనమవుతారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలసి ప్రధాని మరో సభలో పాల్గొననున్నారు.

'వైసీపీపై వ్యతిరేకతే మా ఓటు బ్యాంకు - అధికారమిస్తే అభివృద్ధికి మారుపేరు టీడీపీ అని రుజువు చేస్తాం' - TDP Cheif CBN Interview

బీఆర్​ఎస్​ను దింపడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది - కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు : ప్రధాని మోదీ - PM Modi Interview 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.