ETV Bharat / politics

మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది : ఎమ్మెల్సీ కవిత - ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on Women Reservation : మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్​ సర్కార్​ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్​ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు.

Kavitha Letter to Sonia Gandhi
MLC Kavitha on Women Reservation
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 1:30 PM IST

మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on Women Reservation : మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఆరోపించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్​ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లో ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

MLC Kavitha Fires on Congress : ప్రజల రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని కవిత(MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల స్పూర్తిని పక్కన పెట్టి సీఎం రేవంత్​ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీఓ తీసుకురావడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను మభ్య పెట్టెందుకే కులగణన తీర్మానం : కవిత

Women Reservation GO in Telangana : ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంతో నష్టం జరిగే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు. హారిజాంటల్​ రిజర్వేషన్లతో పాటు రోస్టర్​ పాయింట్​ను ప్రభుత్వం​ రద్దు చేసిందని మండిపడ్డారు. దీనివల్ల మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని అన్నారు. మహిళలకు అవకాశాలు తగ్గుతాయని, రోస్టర్ లేకపోవడంతో మహిళల ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు.

అన్ని శాఖల్లోని ఉద్యోగ నియామకాలపై ఈ ప్రభావం స్పష్టంగా పడుతుందని కవిత తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ అంశాలను గమనించాలని సూచించారు. పాత విధానంలోనే మహిళా రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టులో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్​ ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల్లో 66 వేలు ఆడబిడ్డలకు కచ్చితంగా వస్తాయా లేదా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి బడ్జెట్​ కేటాయించలేదు : ఎమ్మెల్సీ కవిత

"ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉద్యోగ నియామకాల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. హారిజాంటల్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లను రద్దు చేశారు. ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలి. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై సోనియాకి లేఖ రాస్తున్నా. మహిళలకు అన్యాయం చేయకుండా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని కోరుతున్నాను."- కవిత, ఎమ్మెల్సీ

MLC Kavitha on Women Reservation GO : కొత్త జీఓ విడుదల అంశంలో ఎవరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ అంశంపై సోనియా గాంధీ(Kavitha letter Sonia Gandhi), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలకు లేఖ రాసినట్లు తెలిపారు. అందులో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించానని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేయకుండా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సోనియాను కోరినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు.

అప్పుడు తిట్టి, ఇప్పుడెలా నియమిస్తారు - టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్​గా మహేందర్‌రెడ్డిని తొలగించండి : ఎమ్మెల్సీ కవిత

కవిత ఈడీ కేసు మరోసారి వాయిదా - ఈనెల 28న విచారణ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.