MLC Kavitha BC Round Table Meeting at Hanmakonda : రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్‌ల ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్(BC Declaration)లో ప్రకటించినట్టుగా కులగణన చేపట్టడానికి తక్షణ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఆగమాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
'భువనగిరి హాస్టల్ పరిశీలించిన కవిత - మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి'
MLC Kavitha on Census in Telangana : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలని కవిత సూచించారు. ఎంబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని పునరుద్ఘాటించారు. అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపించారు. యూపీఎస్సీ(UPSC) ఎంపికలో 27 శాతం రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ. 20వేల కోట్లు కేటాయించాలి - భట్టి విక్రమార్కకు కవిత లేఖ
"దేశంలో రాజకీయంగా ఓబీసీలకు దక్కాల్సిన వాటా అందడం లేదు. అన్ని రాష్ట్రాల్లో 27 శాతం రిజర్వేషన్ అమలు అవ్వడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నారు. అందుకే గతంలో కేసీఆర్ ఏ రాష్ట్రానికి ఆ స్టేట్ రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పారు. మన రాష్ట్రంలో 42 శాతం బీసీలు ఉన్నారు. కులగణన చేసి ఆరు నెలల లోపు రిపోర్టు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పింది. బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో రెండు నెలలు అవుతున్న ముఖ్యమైన అడుగు ఇప్పటికి ప్రభుత్వం వేయలేదు. బీసీ రిజర్వేషన్ వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు కొత్తగా పదవులు వస్తాయని చెప్పారు. అందుకే తొందరగా ఎన్నికలు నిర్వహించవద్దు."- కవిత, ఎమ్మెల్సీ
MLC Kavitha Tweet on BC Declaration : రాష్ట్రంలో దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ పాలన సాగుతోందని, కాంగ్రెస్ పాలన రాచరికాన్ని గుర్తు చేస్తోందని కవిత మండిపడ్డారు. కేసీఆర్‌ను విమర్శిస్తూ అసభ్య పదజాలం వాడిన ముఖ్యమంత్రిపై తక్షణం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడాన్ని సైతం కవిత తప్పుపట్టారు.
ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభానికి ప్రియాంక గాంధీని ఓ హోదాలో పిలుస్తారు? : ఎమ్మెల్సీ కవిత