ETV Bharat / politics

కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ అనడం దారుణం : జీవన్‌ రెడ్డి - MLC Jeevan Reddy Comments on Modi - MLC JEEVAN REDDY COMMENTS ON MODI

MLC Jeevan Reddy Fire on PM Modi : మత సామరస్యానికి కట్టుబడి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ అని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌ రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ బతికి ఉంటే ఎప్పుడో అయోధ్యలో రామమందిరం పూర్తి అయ్యేదని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని విమర్శించారు.

Jeevan Reddy on Religion
MLC Jeevan Reddy Latest Comments (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 2:14 PM IST

Updated : May 18, 2024, 2:19 PM IST

MLC Jeevan Reddy Fire on PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ​ జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిచిందే రాజీవ్‌గాంధీ ప్రభుత్వమని గుర్తు చేశారు. మతసమారస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

MLC Jeevan Reddy on Religion : అయోధ్యలో రామాలయం గేట్లు 1986లోనే రాజీవ్​ గాంధీ తెరిపించారని జీవన్​ రెడ్డి తెలిపారు. గుడి శంకుస్థాపనకి అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన వ్యక్తి ఉల్లంఘించారని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్​తో కూల్చేస్తారు అనడం దారుణమని, ఈ వ్యాఖ్యలు విశ్వాసాలను రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించారు. ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. బుల్డోజర్​ని తెర మీద తీసుకు వచ్చిందే బీజేపీనని అన్నారు.

బాండ్ పేపర్ రాసి మరీ అర్వింద్ మాట తప్పారు : జీవన్​రెడ్డి - JEEVAN REDDY CHAI PE CHARCHA

MLC Jeevan Reddy Comments : ఎన్నికలక కోసం దేవుడిని వాడుకోవడం మంచిది కాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు. మతసమారస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ దేశంలో లేని విధంగా వివిధ మతాలకు సెక్యులర్ విధానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు దూరదర్శన్​లో రామాయణ మహా భారతాలు ప్రసారం చేశారని అన్నారు. మోదీ వచ్చాకే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్​ గాంధీ ఉన్నప్పుడే జరిగిందని పేర్కొన్నారు.

"అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మూలం న్యాయస్థానం. న్యాయస్థానం తీర్పు వల్లనే రామమందిరం నిర్మాణం జరిగింది. దూరదర్శన్ ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ చేశారు? మతసామరస్యానికి లోక విధానానికి కట్టుబడి ముందుకు పోతుంది. హిందువుల మనోభావాలు గౌరవించేది గాంధీ కుటుంబం." - ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ అనడం దారుణం జీవన్‌ రెడ్డి (ETV Bharat)

'దేశంలో బీజేపీ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారి పోతుంది - ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు తీరుతుంది' - Jeevan Reddy fires On BJP

Last Updated : May 18, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.