ETV Bharat / politics

మహిళా ఎమ్మెల్యే కుర్చీ తీసేశారు - కడపలో ఏం జరిగిందంటే! - KADAPA MUNICIPAL MEETING

కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మాధవిరెడ్డి నిరసన - వాయిదా వేసి బయటకు వచ్చిన మేయర్

MLA Madhavi Reddy Protest in Kadapa Municipal Corporation Meeting
MLA Madhavi Reddy Protest in Kadapa Municipal Corporation Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 2:04 PM IST

MLA Madhavi Reddy Protest in Kadapa Municipal Corporation Meeting : కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస నెలకొంది. మేయర్‌ ఛాంబర్‌లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో ఆ పార్టీ కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. మరో వైపు ఆమె మాట్లాడున్న సమయంలో మేయర్‌ సురేశ్‌, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది.

సమావేశం వాయిదా వేసి బయటకు వచ్చిన మేయర్ : కడప కార్పొరేషన్​లో ఒక మహిళ ఎమ్మెల్యేగా తనకు కుర్చీ లేకుండా అవమానించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మాధవీ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎక్కడ కూర్చునైనా పోరాటం చేస్తానని, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం అవమానించినంత మాత్రాన భయపడిపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మాధవీ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. సమావేశం గందరగోళంగా మారడంతో వాయిదా వేసి మేయర్ బయటకు వచ్చారు.

కడప మేయర్ సురేష్​బాబుపై కేసు నమోదు

మూడంచెల బందోబస్తు ఏర్పాటు : అనంతరం మాధవీ రెడ్డి మాట్లాడుతూ పాలకవర్గం తీరుపై నిప్పులు చెరిగారు. మహిళను అవమానిస్తారా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. మీరు లాగేసినా ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని, కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి తనకు ఉందని. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నామని మండిపడ్డారు. కడప నియోజకవర్గంలో మహిళలంతా వీరికి గుణపాఠం చెబుతారని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నగరపాలక సంస్థ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.

"సమావేశంలో మహిళను అవమానపరుస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిలబడి మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం."- కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి

టీడీపీపై వ్యతిరేకత పెంచేలా మేయర్ కుట్ర: ఎమ్మెల్యే మాధవీరెడ్డి - MLA Madhavi Reddy Fire On Mayor

వైఎస్సార్​సీపీ రౌడీలకు కడపలో ఆస్కారం లేదు- ఇక వీపులు విమానం మోతే: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి - MLA Madhavi Warning to YCP Leaders

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.