Ministers Meeting in Peddapalli Parliamentary Constituency : బీఆర్ఎస్ పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు లేదని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Polls 2024)లో రాష్ట్రంలో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మంత్రులు ఇద్దరు బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ధ్వజమెత్తారు.
అనంతరం వంద రోజులు అయిందని హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఆరోపణలు చేస్తున్నారే గానీ, బీఆర్‌ఎస్ పార్టీ రెండు నెలలు తర్వాత పాలన మొదలు పెట్టారని ఆలోచించారా అంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో పథకాలను(Congress Schemes) ప్రారంభించిందని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే నిందించడం ఎంతవరకు సమంజసం అంటూ మంత్రి శ్రీధర్ అన్నారు.
బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం పరామర్శించలేదని గిరిజన శాఖ మంత్రి సీతక్క అన్నారు. కానీ ఇప్పుడు రైతుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)లను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా యువకుడు వంశీకృష్ణను ఆదరించాలని, అభ్యర్థులను చూసి ఓటు వేయాలని మంత్రి సీతక్క కోరారు.
"అయ్యా కేసీఆర్ మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా పైన రూ.7 లక్షల కోట్ల అప్పును మోపారు. ఆ అప్పుతో పాటు వడ్డీని కూడా మోపారు. కట్టడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాము. రైతుకు ఏ విధంగా మేలు చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగింది." - శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
"బడులు గురించి బీఆర్ఎస్ మాట్లాడదు. మడుల గురించి మాట్లాడదు. ప్రధాని మోదీ ఏమో నల్లచట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తారు. ఈయనేమో రైతులకు సరైన ధరలేక ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించరు. ఈరోజు ప్రజల మధ్యకు వెళుతున్నారంటే వాళ్ల మీద వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాంలను పక్కదారి పట్టించేందుకు ఈరోజు రైతుల దగ్గరకు వెళుతున్నారు. ఒక్కసారైన ఏ ఒక్క రైతు, నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే బయటకు వెళ్లారా?." - సీతక్క, మంత్రి
తుక్కుగూడ సభకు అనూహ్య స్పందన - కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ - 14 సీట్లకు ఇక ఢోకా లేదు!
మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు - పోరాడే సైనికులు - 'జన జాతర' సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి