ETV Bharat / politics

కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్‌

Minister Uttam on Krishna Water Supply Issues : కృష్ణా జలాల విషయంలో కేసీఆర్​, ఏపీ సీఎం జగన్​ ఇద్దరు మధ్య ఉన్న ఒప్పందాలతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆయన, కేసీఆర్, బీఆర్​ఎస్​ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Minister Uttam Comments on KCR
Minister Uttam on Krishna Water Supply Issues
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 10:14 PM IST

కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్‌

Minister Uttam on Krishna Water Supply Issue : కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులు కట్టి, తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి తరలిస్తుంటే కేసీఆర్ నిశ్శ బ్ధంగా ఉన్నారన్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్(AP CM Jagan) ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆయన బీఆర్​ఎస్​పై విమర్శలు గుప్పించారు. లక్ష కోట్ల దోచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.

మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే అవకాశం : పాక్షికంగా కుంగిన మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని, మేడిగడ్డ బ్యారేజ్​పై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు(Sundilla Project) కూడా ప్రమాదంలో ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. కృష్ణానది జలాలపై తాము ముందుకు పోలేదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నీళ్ల పంపకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే విడిపోయిన తరువాతే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆవేదన చెందారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్

"2022 ఏడాదిలో రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీం పేరిట, ఏపీ ముఖ్యమంత్రి జగన్​ కృష్ణానది జలాల్లో గ్రావిటీ ద్వారా మన రాష్ట్రానికి ఉచితంగా వచ్చే 8 టీఎంసీల నీటిని అన్యాయంగా తరలించుకుపోయారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్​ నగర్​, ఖమ్మం జిల్లాలకు వచ్చే నీళ్లను ఆంధ్రప్రదేశ్​కు తరలిపోయే విధంగా జగన్మోహన్​ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్ట్ ద్వారా 203 టీఎంసీలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరలిస్తుంటే కనీసం నోరైనా మెదపలేదు."-ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

Minister Uttam Comments on CM Jagan, KCR : కృష్ణా జలాలపై కేసీఆర్​, హరీశ్​రావు పదేపదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. నీళ్లకోసం సైతం ఉద్యమించి ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్, నాడు దిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వం, కేఆర్​ఎంబీ(KRMB) ముందు రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల వాటాలో అన్యాయం చేశారన్నారు. తెలంగాణకు 299 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్​కు 511 టీఎంసీ అడిగింది కేసీఆర్​ కాదా సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్​ వాడుకోవాల్సిన దానికన్నా 8 రెట్లు అధికంగా నీటిని వాడుకుంటే బీఆర్​ఎస్​ అధినేత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

రెండు టీఎంసీల నీళ్ల కోసం రూ.లక్షల కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ఈ రూ.లక్ష కోట్లు దోచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Agriculture Minister Thummala), కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా హుజుర్​నగర్​, కోదాడ నియోజకవర్గాల్లో ప్రభుత్వం అందిస్తున్న వైద్య, ఆరోగ్య మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.

అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో సాగు నీటి కేటాయింపులు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్​దే : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.