Minister Uttam fires on BJP : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ దశ, దిశను నిర్ణయిస్తాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు.
బీజేపీ గత పదేళ్లలో మతతత్వ రాజకీయం తప్ప చేసేందేమీ లేదు : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on BJP
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి దేశంలోనే అత్యధిక మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ జూన్ 9న ప్రధానిగా ఎన్నిక కాబోతున్నాడని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ పార్టీ మద్ధతు తెలపడం హర్షించదగిన విషయమని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో చిన్నస్థాయి కార్యకర్తల సమావేశానికి ఇంతపెద్ద సంఖ్యలో జనం రావడం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న ఆధరాభిమానాలను సూచిస్తాయని మంత్రి తెలిపారు.
"త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ దశ, దిశను నిర్ణయించబోతున్నాయి. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ వస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు" - ఉత్తమ్ కూమార్ రెడ్డి, మంత్రి