ETV Bharat / politics

హైదరాబాద్​కు ఒక్క రూపాయి తీసుకురానివాళ్లు మనకు అవసరమా? : మంత్రి పొన్నం - PONNAM ON HYDERABAD DEVELOPMENT - PONNAM ON HYDERABAD DEVELOPMENT

Minister Ponnam Slams BJP and BRS : హైదరాబాద్​కు ఒక్క రూపాయి తీసుకురానివాళ్లు కేంద్రమంత్రులుగా ఉండేదుకు అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. బీఆర్​ఎస్​ నేతలది కాళేశ్వరం టూర్​ కాదు విహారయాత్రలా ఉందని ఎద్దేవా చేశారు. రైతులను కాపాడే బాధ్యత కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు.

Minister Ponnam fire on BJP and BRS
Minister Ponnam fire on BJP and BRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:49 AM IST

Updated : Jul 27, 2024, 11:06 AM IST

Minister Ponnam Slams Modi Govt Over Budget 2024 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో హైదరాబాద్​ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్​ వద్ద ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​లపై విమర్శలు చేశారు.

కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి హైదరాబాద్​ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​ చెప్పారు. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్​కు ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. అలాగే గతంలో స్మార్ట్​ సిటీ వస్తే కరీంనగర్​కు ఇచ్చారని ఇప్పుడు హైదరాబాద్​ నగరానికి స్మార్ట్​ సిటీ నిధులు తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​ నగర అభివృద్ధికి కిషన్​ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

చారిత్రక నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం వివక్ష కాదా? : మంత్రి పొన్నం - Minister Ponnam on Union Budget

కిషన్​ రెడ్డి అఖిలపక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే మేం వస్తాం : ఎంపీలుగా ఉన్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్రమంత్రులుగా ఉండే అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వలేదంటే బీజేపీ వాళ్లు తమపై బురద జల్లారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్​ రెడ్డి అఖిలపక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు.

హైదరాబాద్​ నగరానికి కేంద్రం ఏం ఇస్తుందో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ డిమాండ్ చేశారు. బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. గతంలో బిల్లుల విషయంలో మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు ఇచ్చి, నీతి ఆయోగ్​ సమావేశానికి వెళ్లకుండా ఉన్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్​పై తెలంగాణకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్​ సమావేశానికి వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామని వెల్లడించారు.

కాంగ్రెస్​ హయాంలో ఎల్లంపల్లి పూర్తి : కాంగ్రెస్​ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయిందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడం వలన తెలంగాణ భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. విహారయాత్రలకు వెళ్లినట్లు బీఆర్​ఎస్​ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. రైతులను కాపాడే బాధ్యత కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకుందని తేల్చి చెప్పారు.

"ఆనాడు కేంద్రానికి అన్ని బిల్లులకు సపోర్టు చేసి కేవలం నీతి ఆయోగ్​ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా మంచిగా పని చేశామంటే సరిపోదు. కానీ మేము బడ్జెట్​పై నీతి ఆయోగ్​ సమావేశానికి హాజరు కాలేదు. ఇప్పుడు తమ నిరసనను తెలియజేయడానికి అదొక వేదిక మాకు. హైదరాబాద్​కు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఎన్ని నిధులు తీసుకువచ్చారు. ఎంపీలుగా ఉన్న నగరానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు." - పొన్నం ప్రభాకర్​, మంత్రి

మిడ్​మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ అజెండా : మంత్రి పొన్నం - Minister Ponnam On mid manair dam

Last Updated : Jul 27, 2024, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.