Minister Ponnam Prabhakar Fires On KCR : రాష్ట్రంలో కరవును, రైతులను ప్రతిపక్షాల నాయకులు రాజకీయాల (politics) కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.
Ponnam Prabhakar Fires On Bandi Sanjay : రైతుల సమస్యల(Farmers Problems) పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు దీక్ష చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఓట్ల కోసం మొన్నటిదాకా రాముని ఫొటో పెట్టుకొని, ఇప్పుడు రైతుల పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కుంగిపోతే సలహాలు ఇవ్వకుండా నాలుగు నెలలుగా మాట్లాడని కేసీఆర్, ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ డ్రామాలు పక్కనపెట్టి, రాష్ట్రంలో కరవు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంతో (State Government) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ బండి సంజయ్ కలిసి రావాలని కోరారు.
"వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలిగింది. భూగర్భ జలాలు పడిపోయాయి. దాన్ని కూడా కాంగ్రెస్ కరవు తెచ్చింది అని ఆరోపించే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతున్నా. బండి సంజయ్ దీక్ష ఇక్కడ కాదు, కేంద్రప్రభుత్వం రైతులకు సహకారం అందించే విధంగా అక్కడ (దిల్లీ) చేయాలని కోరుతున్నా. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలని కోరుతున్నా" - పొన్నం ప్రభాకర్, మంత్రి
Minister Ponnam Morning Walk In Siddipet : అంతకుముందు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక (Morning WalK) నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పార్టీ శ్రేణులు యువకులతో కలిసి ఉదయపు నడకలో పాల్గొన్న మంత్రి బాటసారులు, ప్రజలను ఆత్మీయంగా పలకరించి మాట్లాడారు. పలువురు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన మంత్రి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులతో ముచ్చటించారు
కరవు అనేది ప్రకృతి రాజకీయ పార్టీలను అనడం సరికాదు : పొన్నం ప్రభాకర్