ETV Bharat / politics

కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే - అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు నియంతృత్వం వస్తుంది : పొన్నం - Minister Ponnam Fires On Modi govt

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 7:31 PM IST

Minister Ponnam Fires On Modi govt : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ ప్రభుత్వం, చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం, ఏ ఒక్కరి ఖాతాల్లోనైనా వేశారా? అని మంత్రి ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Minister Ponnam Fires On Modi govt
Minister Ponnam Fires On Modi govt

Minister Ponnam Fires On Modi govt : కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు నియంతృత్వం వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.

Ponnam Prabhakar Comments On BJP : ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసి, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని గతంలో చెప్పిన ప్రధాని మోదీ, ఏ ఒక్కరి ఖాతాల్లోనైనా వేశారా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం, చేయలేదని పొన్నం విమర్శించారు. నల్ల చట్టాలపై రైతులు నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానపరిచారన్నారు. అర్ధరాత్రి తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని మాట్లాడి అమరవీరులను అవమాన పరిచారని అన్నారు.

Minister Ponnam Fires On Bandi sanjay : బండి సంజయ్​పై మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు చేశారు. తల్లీబిడ్డ గురించి సంజయ్ మాట్లాడారని చెప్పారు. తల్లికి బిడ్డ పుడితే నర్స్ చెబితేనే తెలుస్తుంది అన్న వ్యక్తి ప్రజలకు అవసరమా? అన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అత్తగారి ఊరు ఉందని చెప్పి నిర్వాసితులకు హామీ ఇచ్చి నెరవేర్చని అసమర్థుడన్నారు.

సిరిసిల్లకు రావాల్సిన టెక్స్ టైల్ పార్కు వరంగల్​కు తరలించిన అసమర్థుడు వినోద్ కుమార్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వినోద్ కుమార్​కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కవిత అరెస్టుపై డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఎంపీలుగా గెలిస్తే బీజేపీ వద్దకు వెళ్తారని చెప్పారు. కార్యకర్తలందరూ 2014 ముందు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బూత్​ల వారీగా అత్యధిక మెజారిటీ తీసుకురావాలన్నారు. కష్టపడిన వారికి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీలు ఏమయ్యాయి : పొన్నం ప్రభాకర్

కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించింది : మంత్రి పొన్నం ప్రభాకర్‌ - Ponnam comments on BRS

బీజేపీ అమలు చేయని హామీలపై చర్చకు సిద్ధమా : మంత్రి పొన్నం ప్రభాకర్ - Lok Sabha Elections 2024

బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేంటో చెప్పి​ ఓట్లడగాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​ - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.