ETV Bharat / politics

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం రాజ్యాంగాన్నే మార్చేస్తుంది :మంత్రి పొన్నం - Minister Ponnam Fires On BJP

Minister Ponnam Prabhakar Fires On BJP : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలను వక్రీకరించారనే ఆరోపణలతో సీఎం రేవంత్​కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయించాలని చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ధ్వజమెత్తారు. దమ్ముంటే అరెస్టు చేసి చూపించాలని సవాల్ చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Minister Ponnam Prabhakar  Fires On BJP
Minister Ponnam Prabhakar Fires On BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 2:40 PM IST

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం రాజ్యాంగాన్నే మార్చేస్తుంది :మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar Fires On BJP : రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలను వక్రీకరించారనే ఆరోపణలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేయించాలని చూస్తున్నారని బీజేపీపై మంత్రి పొన్నం విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దమ్ముంటే అరెస్టు చేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్ధతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్​లో చేరారు.

Ponnam Prabhakar Comments On Bandi sanjay : అనంతరం కార్నర్ మీటింగ్​లో పాల్గొని మాట్లాడుతూ ముల్కనూర్ అంబేడ్కర్ సాక్షిగా హుస్నాబాద్ నియోజకవర్గానికి, భీమదేవరపల్లి మండలానికి తన తర్వాత ఎంపీలుగా పనిచేసిన వినోద్ కుమార్, బండి సంజయ్ ఏం చేశారో చర్చకు రావాలని పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ చేశారు. బీజేపీ అభ్యర్థి మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతున్నాడని, చేసిన అభివృద్ధి చెప్పమంటే చేసిందేమీ లేక రాముడి ఫొటోలతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే - అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు నియంతృత్వం వస్తుంది : పొన్నం - Minister Ponnam Fires On Modi govt

Ponnam On Amit Shah Fake Video Issue : బీజేపీ ఐటీ సెల్​ పెట్టిన ఫేక్ పోస్టులరై వందల ఫిర్యాదులు ఇస్తే ఒక్కసారైనా చర్య తీసుకున్నారా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అమిత్ షాపై ఒక్క వీడియో వస్తే భయపడుతున్నారని అన్నారు. రిజర్వేషన్లు తొలగిస్తారని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణం వరకు ప్రజలకు తెలిసి సీట్ల గ్రాఫ్ పడిపోయిందని బీజేపీ నాయకులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. చేతి గుర్తుకు ఓటేసి ఎంపీగా రాజేందర్ రావును గెలిపించాలని, రాజేందర్ రావు గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

"ఒక వేళ పొరపాటున బీజేపీ వచ్చే లోక్​సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలిస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చివేస్తుంది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. మొత్తం రిజర్వేషన్లను తీసివేసి అందర్నీ రోడ్డుమీదకు తీసుకువచ్చి అంబానీ, అదానీలకు అప్పగించే ప్రక్రియ జరుగుతుంది. గుళ్లో దేవుడుండాలి గుండెల్లో భక్తి ఉండాలి. దేవుడి ఫొటోలు పట్టుకుని ఓట్లు వేయాలని అడుగుతున్నారు బీజేపీ నాయకులు"- పొన్నం ప్రభాకర్, మంత్రి

మీరిచ్చిన హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాం - బండి సంజయ్​కి పొన్నం సవాల్ - PONNAM CHALLENGES BANDI SANJAY

పదేళ్లు అధికారంలో ఉన్న వారి నిర్లక్ష్యం వల్లే కార్మికుల జీవితాలు ఇలా ఉన్నాయి : మంత్రి పొన్నం ప్రభాకర్​ - Minister Ponnam on Handloom workers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.