ETV Bharat / politics

భయపడితే రాజకీయం చేయలేము - మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు - minister konda surekha fires on ktr - MINISTER KONDA SUREKHA FIRES ON KTR

Minister Konda Surekha fires on KTR : మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ తిప్పికొట్టారు. 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్‌కు, గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతిక హక్కులేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల కోసం అభివృద్ధి ఫలాలు అందించడమేనన్న మంత్రి, ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అమలు చేస్తుందని ఉద్ఘాటించారు.

LOK SABHA ELECTIONS 2024
Minister Konda Surekha fires on KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 7:43 PM IST

Minister Konda Surekha fires on KTR : భయపడితే రాజకీయం చేయలేమని, కేసులు ఉంటే రాజకీయ నాయకులు ఇంకా పెద్దవాళ్లు అవుతారని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ పాలనలో తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, నిర్భంధాలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టడం వల్లే రాజకీయంగా ఎదిగి, ఇప్పుడు మంత్రి పదవిని చేయగలుగుతున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్​ ప్రచార రథాల సందడి - Congress Campaign Vehicles Started

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించారు. తమ పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 100 హామీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.

LOK SABHA ELECTIONS 2024 : దళితులకు మూడెకరాల భూమి దగ్గర నుంచి నిరుద్యోగ భృతి మొదలగు పథకాలు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్‌ను (KTR) కొండా సురేఖ ప్రశ్నించారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించి, హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేటీఆర్‌, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని దుయ్యబట్టారు.

సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు సాధిస్తామని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ మరిన్ని పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. మెదక్‌ ఎంపీగా నీలం మధును గెలిపించి రాహుల్‌, సోనియా గాంధీలకు బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

"10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్‌కు, గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల కోసం అభివృద్ధి ఫలాలు అందించడమే. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అమలు చేస్తుంది". - కొండా సురేఖ, మంత్రి

భయపడితే రాజకీయం చేయలేము- మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

దురదృష్టవశాత్తు ఓడిపోయా : కార్యకర్తలందరూ మంచిగా పని చేసినా దురదృష్టవశాత్తు ఓడిపోయానని జగ్గారెడ్డి అన్నారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. కలిసికట్టుగా పని చేసి, నీలం మధును పార్లమెంట్‌కు పంపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

గ్రౌండ్​ లెవెల్​లో బీజేపీ పట్టు కోల్పోయింది : మంత్రి కొండా సురేఖ - Lok Sabha Election 2024

స్నేహితులతో కలిసి డ్యాన్స్​ చేసిన మంత్రి కొండా సురేఖ - వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.