ETV Bharat / politics

కేసీఆర్‌ 2 ఎంపీ సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : మంత్రి కోమటిరెడ్డి - Minister Komati Reddy Comments - MINISTER KOMATI REDDY COMMENTS

Minister Komati Reddy Interesting Comments on KCR : లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కారు గ్యారేజ్​కు పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని గుర్తు చేశారు. పార్టీ నల్గొండ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

Minister Komati Reddy Fire on BRS
Minister Komati Reddy Venkat Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 3:21 PM IST

Minister Komati Reddy Interesting Comments on KCR : బీఆర్ఎస్​పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాల్లో నైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్​ పార్టీ రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు. నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఏం చెబుదామని మిర్యాలగూడకు వస్తున్నారని ప్రశ్నించారు. హస్తం పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ రెడ్డి నామినేషన్‌ ర్యాలీలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రులు ఉత్తమ్​ కుమార్​, మాజీ సీఎల్పీ జానారెడ్డి పాల్గొన్నారు.

దానం నాగేందర్​ను లక్ష లేదా రెండు లక్షల మెజారిటీతో గెలిపించుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి - Lok Sabha Election 2024

Congress Nomination Rally in Nalgonda : కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేసిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము రైతు రుణమాఫీ చేస్తే, బీఆర్ఎస్​ నాయకులు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. నల్గొండలో కాంగ్రెస్​కు పోటీ లేదని అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు.

"లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుందా? కేసీఆర్‌ 2 ఎంపీ సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కారు గ్యారేజ్‌కు పోయింది. నల్గొండకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకు కేసీఆర్​ వస్తున్నారు." - కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

Komati Reddy Reaction KCR Interview : ఓటీవీ ఛానల్​లో కేసీఆర్​ నాలుగు గంటలు ఇంటర్వ్యూ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. తిహార్​ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకి వస్తే దాచి ఇంట్లో పెట్టుకోమని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు వస్తాయన్న కేసీఆర్​ వ్యాఖ్యలపై కనీసం రెండు సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్​ చేశారు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్​ రెడ్డి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని కోమటిరెడ్డి అన్నారు.

కేసీఆర్‌ 2 ఎంపీ సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

'మాది మాటల ప్రభుత్వం కాదు - చేతల సర్కార్ - రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్​దే అధికారం' - Minister Komati reddy Fires On BRS

కాంగ్రెస్​లో శిందేలు లేరు - రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారు : మంత్రి కోమటిరెడ్డి - Komatireddy Comments On CM Revanth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.