ETV Bharat / politics

ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖ మరింత ప్రక్షాళన : మంత్రి జూపల్లి - Jupally on Excise Department

Minister Jupally Krishna Rao Press Meet : ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్​లో పెట్టిందని తెలిపారు. మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలకు కాదని ఈ సందర్భంగా చెప్పారు. గాంధీభవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Minister Jupally Krishna Rao Press Meet
Minister Jupally Krishna Rao Press Meet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 5:13 PM IST

Updated : May 21, 2024, 7:17 PM IST

Minister Jupally Krishna Rao on Excise Department : గత ప్రభుత్వం పదేళ్లపాటు టెండర్లు లేకుండా ఒక్కరికే హోలోగ్రామ్ తయారీని అప్పగించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఒక్కోదాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. బ్రూవరీల నుంచి స్టాక్ పక్కదారి పట్టకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. మద్యం కొరత ఉంటే ప్రజలకు నష్టం లేదని స్పష్టం చేశారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప బదిలీలు జరిగేవి కావని ఆరోపించారు. ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్​ఎస్ నేతల మాటలు ఉన్నాయని చెప్పారు.

కొత్త బ్రాండ్లకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు : ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్​శాఖను మరింత ప్రక్షాళన చేస్తామని తెలిపారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు, తాము పరిశీలించలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్​ను పటిష్ఠంగా నివారిస్తున్నామని వెల్లడించారు. మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలకు కాదని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే టానిక్ మద్యం దుకాణాలకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీకి మధ్య తేడా ఉందని తెలిపారు.

"ఈ లిక్కర్​ను రూ.10 వేల కోట్ల నుంచి రూ.34 వేల కోట్లకు తీసుకుపోయిందే గత బీఆర్​ఎస్ ప్రభుత్వం. అది అనాధికార పాలసీ. ప్రభుత్వ పాలసీ ఏదైనా ఉంటే అది కేబినెట్ నిర్ణయిస్తుంది. ఈరోజుకి 19 మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని బ్రాండ్లకు సంబంధించి. గత ప్రభుత్వం అక్టోబరు నుంచే బిల్లులు సుమారు రూ.2350 కోట్లను పెండింగ్​లో పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వం రూ.40 వేల కోట్లను బకాయిలుగా పెట్టింది. ఎక్సైజ్ డిపార్టుమెంటుతో కలిపి బకాయిలు పెట్టింది. ఒక్క లిక్కర్​కే రూ.2350 కోట్లను చెల్లించాం. పైరవీలు, ముడుపులు చెల్లిస్తే తప్పా గత ప్రభుత్వంలో పోస్టింగ్​లు వచ్చేవి కావు." - జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి

ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖ మరింత ప్రక్షాళన : మంత్రి జూపల్లి (ETV Bharat)

త్వరలో 'కల్లు బార్లు' ఏర్పాటు దిశగా ప్రభుత్వ కార్యాచరణ : మంత్రి పొన్నం ప్రభాకర్

రూ.కోటి 20 లక్షల విలువైన నకిలీ మద్యం ధ్వంసం

Last Updated : May 21, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.