ETV Bharat / politics

కేంద్రమంత్రి అమిత్​ షాతో ఈటల రాజేందర్ భేటీ - రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఖాయమయ్యేనా? - MP Etela Rajender Meet to Amit Shah - MP ETELA RAJENDER MEET TO AMIT SHAH

Etela Rajender Meet to Amit Shah : తెలంగాణ నుంచి కేంద్రమంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమిత్‌షాను, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Malkajgiri MP Etela Rajender Meet to Amit Shah
Etela Rajender Meet to Amit Shah (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 3:34 PM IST

Updated : Jun 10, 2024, 3:50 PM IST

Malkajgiri MP Etela Rajender Meet to Amit Shah : బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్​ షాను మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో షాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈటల రాజేందర్​ను నియమించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్ఠానం ఉంది. ఇప్పటికిప్పుడు మారుస్తుందా లేక సంస్థాగత బలోపేతం తరువాత మారుస్తారా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Etela Rajender Telangana BJP President : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు దిల్లీలో ఉండి లాబీయింగ్​ చేస్తుంటే పార్టీ శ్రేణుల్లో ప్రెసిడెంట్​ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. మరోవైపు కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

కిషన్ రెడ్డి సారథ్యంలో శాసనసభ, సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ మంచి సీట్లు, ఓట్లు సాధించింది. రెండోసారి మోదీ మంత్రివర్గంలో కిషన్ రెడ్డి ఎంపిక కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటలకు ఈ బాధ్యతలు కట్టబెడతారని విశ్వసనీయ సమాచారం. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్​ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది.

మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు : సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ తన ప్రత్యర్థి కాంగ్రెస్​ నేత సునీత మహేందర్​ రెడ్డిపై 3.86 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ పార్లమెంట్​ స్థానం నుంచి ఎవరు గెలిచినా వారు రాజకీయపరంగా అత్యున్నత శిఖరాలకు వెళ్తారనేది ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈటలకు స్టేట్​ ప్రెసిడెంట్ పదవి కట్టబెడితే ఈ ఆనవాయితీ కొనసాగినట్లవుతుంది.

హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తాం: ఈటల రాజేందర్ - BJP MP Etela Rajender Comments

అక్కడ గెలిస్తే ఫేటే మారిపోతుంది - మరి ఈటల భవిష్యత్ కూడా బంగారమేనా? - Etela Rajender Won Malkajgiri MP SEAT

Last Updated : Jun 10, 2024, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.