ETV Bharat / politics

గిరిపుత్రుల ఖిల్లా మానుకోటలో ముక్కోణపు పోరు - మహిళా ఓటర్ల మనసు గెలిచిన వారే విజేత! - Mahabubabad Lok Sabha Polls 2024

Mahabubabad MP Elections 2024 : గిరిపుత్రుల ఖిల్లాగా పేరుగాంచిన మానుకోటలో పార్లమెంటు ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగింది. మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోరు నెలకొంది. ముగ్గురు పార్టీల అభ్యర్థులూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వారికి మద్దతుగా మండుటెండలనూ లెక్కచేయక, అగ్రనేతలు సైతం ప్రచారానికి విచ్చేశారు. మరి ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Mahabubabad Telangana Lok Sabha constituency election 2024
Mahabubabad MP Elections 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 12:09 PM IST

Mahabubabad Lok Sabha Polls 2024 : మానుకోట ఎస్టీ రిజర్వుడు పార్లమెంటు స్ధానంలో సార్వత్రిక ఎన్నికల పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఎన్నికల షెడ్యూల్ స్టార్ట్​ అయిన నుంచి అన్ని పార్టీల అగ్రనేతల ప్రచారంతో ఆసక్తికర పోరు సాగింది. గులాబీ పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌, కమల దళం నుంచి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ తలపడుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు ఒక్కోసారి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించగా, ఈసారి ఎవరు నెగ్గినా వారికి ద్వితీయ విజయమే అవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలే. నర్సంపేట మాత్రం జనరల్‌ స్థానం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించగా, భద్రాచలం నుంచి నెగ్గిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.

మానుకోటలో నువ్వా-నేనా : గిరిజనుల కోటలో పాగా వేసేందుకు మూడు ప్రధాన పార్టీలు వారి సమస్యలు, అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందుంచుతూ ఓట్లను అభ్యర్థించాయి. ఈ స్థానం పరిధిలో అత్యధికులు గిరిజనులే కావడంతో వారి మన్నన పొందేందుకు ఎంపీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక్కడి నుంచి పోటీలో అభ్యర్థులుగా బరిలో ఉన్న వారంతా లంబాడీలే కాగా, సుమారు నాలుగున్నర లక్షల ఓట్లు ఉన్న ఆదివాసీల మద్దతు ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Mahabubnagar Congress MP candidate Balaram Naik : కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచిన బలరాంనాయక్‌ 2009లో ఇక్కడ పోటీ చేసి తొలిసారి విజయ కేతనం ఎగురవేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, రెండుసార్లు ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆయన ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. పార్టీ మారకుండా ఆరంభం నుంచి కాంగ్రెస్‌లోనే ఉండటం, 2 సార్లు వరుసగా ఓడిపోవడం సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

Mahabubnagar BRS MP candidate Maloth Kavitha : భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత గత బీఆర్ఎస్ సర్కార్ గిరిజనుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నించారు. తనను గెలిపించి గులాబీ పార్టీకి ఇక్కడి నుంచి హ్యాట్రిక్‌ విజయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్‌ తన కుమార్తె కవిత విజయం కోసం పాటుపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు జమ చేశామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని ఇలా అనేక అంశాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదని కవిత ప్రచారం చేస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీని వీడటం, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌లో చేరడం లాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారినా ముందుకెళ్తున్నారు. గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌ రోడ్‌ షోతో పార్టీ నేతల్లో ఉత్సాహం నింపగా, మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్‌ అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా శ్రమించారు.

Mahabubnagar BJP MP candidate Ajmira Sitaram Naik : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తమ పదేళ్ల పాలనపై నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో దించే లక్ష్యంతో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ను బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి చేర్చుకొని మరీ అభ్యర్థిగా నిలిపింది. కేంద్ర సర్కార్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు సహా వివిధ అంశాలను ఆయన ప్రజలలోకి తీసుకెళ్తూ ప్రచారం నిర్వహించారు. కేంద్రం రాష్ట్రంలో చేసిన పదేళ్ల అభివృద్ధి పనులతో ప్రజలు కమలాన్ని ఆశీర్వదిస్తారని పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.

Mahabubabad Lok Sabha Polls 2024
Mahabubabad Lok Sabha Constituency Total Voters (ETV Bharat)

Mahabubabad Lok Sabha Constituency Total Voters : మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 15,33,858 మంది ఉండగా, అందులో పురుషులు 747836, మహిళలు 78,4424, ట్రాన్స్ జెండర్లు 106 మంది ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది.

Lok Sabha Elections 2024
Mahabubabad Assembly segments (ETV Bharat)

ఆసక్తి రేపుతున్న ఖమ్మం, మహబూబాబాద్​ ఎంపీ ఎన్నిక - ఈసారి విజయం ఎవరిదో ? - Khammam and Mahabubabad Fight

సాయంత్రం వరకే ఛాన్స్ - నేటి నుంచి 2 రోజులు వైన్స్‌ బంద్! - Wine Shops Close in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.