Lok Sabha Elections Campaign In Telangana 2024 : ఉద్యమ నాయకుడిగా కేసీఆర్(KCR)కు పాలనాపగ్గాలు అప్పగిస్తే, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిపేట్‌లో జరిగిన ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎస్సారెస్పీ (SRSP)ని నిర్మించిందని వివరించారు. కానీ బీఆర్ఎస్ నేతలు కమీషన్లకి కక్కుర్తిపడి కట్టిన ప్రాజెక్టులు మూన్నాళ్ల ముచ్చటగానే మారాయని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే కరవు వచ్చిందన్న విమర్శలను ఖండించారు. పసుపు బోర్డు తెస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆర్వింద్ మాట తప్పారని ఆయన మండిపడ్డారు.
'మేడిగడ్డలో ఉన్న నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ఆర్వింద్‌కు చిత్తశుద్ధి ఉంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారో అమలు చేాయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం ఉత్తర్వులకే పరిమితై రైతుల ఆశలపై నీళ్లు చల్లారు.'-జీవన్‌రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి
BRS MP Candidates on Congress : అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్(Congress) ప్రజలను నమ్మించి మోసం చేసిందని నాగర్‌కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన నియోజకవర్గస్థాయి సన్నాహక భేటీలో పాల్గొన్న ఆయన, అధికారపార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా లొంగిపోవద్దని సూచించారు. కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి ఓట్లువేసిన ప్రజలకు 100 రోజుల్లోనే వారి బాగోతం అర్థమైందని ఖమ్మం బీఆర్ఎస్(BRS) పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. వైరాలో పార్టీశ్రేణులతో సమావేశమైన ఆయన, పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి మోసపోకుండా బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు.
Parliament Elections Campaign 2024 : వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేడు ఎన్నికల కోడ్ వచ్చిందని రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, 11 ఏళ్లపాటు జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి సేవలు వినియోగించుకోవలని సూచించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని పలు గ్రామాల్లో చేవెళ్ల బీజేపీ(BJP)ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబీకులు ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతున్న వారు దేశం అభివృద్ధితో ముందుకు సాగాలంటే బీజేపీ గెలవాలని విజ్ఞప్తి చేశారు.
'మనకు అన్నం పెట్టిన వారు ఎవరు? సున్నం పెట్టిన వారు ఎవరో ఆలోచించుకోవాలి. అన్నం పెట్టింది కేసీఆర్ అయితే రైతన్నలకు సున్నం పెట్టింది కాంగ్రెస్. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ.'-హరీశ్‌రావు, మాజీ మంత్రి
ఎండలు ఠారెత్తిస్తున్న లోక్‌సభ ప్రచారంలో తగ్గేదేలే అంటున్న పార్టీలు - Lok Sabha Elections 2024