Lok Sabha Elections 2024 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్, లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యనేతలు, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు.
గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం : రేవంత్‌రెడ్డి - lok sabha elections 2024
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంత్రి శ్రీధర్‌బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రత్నాపూర్ సమీపంలో ఉపాధిహామీ కూలీలతో ఆయన ముచ్చటించారు. రామగుండం సింగరేణి సంస్థ జీడీకే ఒకటో బొగ్గు గని వద్ద, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో, మాజీమంత్రి సర్వే సత్యనారాయణతో కలిసి మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా, సూర్యాపేట జిల్లా మోతెలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో, మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డికి మద్దతుగా, దుబ్బాక నియోజకవర్గం రామక్కపేటలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో, మహబూబాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత ఎన్నికల ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఉపాధి హామీ కూలీలతో ఆమె ముచ్చటించారు.
హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, కుకునూరుపల్లి మండలాల్లో, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘనందన్‌రావు రోడ్‌షో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ‌్యర్థి ధర్మపురి అర్వింద్ పర్యటించారు. వివిధ గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
'రజాకార్ల నుంచి హైదరాబాద్ ముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించండి' - AMIT SHAH CAMPAIGN IN HYDERABAD