Leadership Qualities Of Lord Ram : శ్రీరాముడు తండ్రి ఆదేశాలను పాటించేవాడు. అలానే ప్రతి నాయకుడు తమ పార్టీ అధిష్టానం సిద్ధాంతాలను పాటించాలి. తండ్రి మాట కోసం కోదండ రాముడు వనవాసానికి వెళ్లాడు. ప్రస్తుతం లీడర్లు నామినేషన్ ప్రక్రియ అనంతరం జనావాసంలోకి రావాలి. అడవుల్లో తిరుగుతూ అక్కడ జరిగే మంచి, చెడులను గమనిస్తూ కష్టమైనా, నష్టమైనా ఆనందంగా రాముడు(Sri Rama Navami) జీవించాడు. ఇదే విధంగా నాయకులు జనావాసంలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని, నెరవేర్చేందుకు సరైన ప్రణాళికలు చేస్తానని హామీలు ఇచ్చి నెరవేర్చాలి. అభ్యర్థులు జనారణ్యంలో వనవాసం చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే ఓటర్ల మనసు గెలుచుకోగల్గుతారు.
Lord Rama Leadership Qualities : రాముడు అడవుల్లో నివసించేటప్పుడు ప్రతి సమస్యకు తనకంటూ ఓ సైన్యాన్ని పొందగలిగాడు. ప్రతి జీవి తనపై భక్తిని చూపిస్తూ తమ వంతు సాయం చేసింది. చివరికి ఉడత కూడా సముద్రంపై వారధి కట్టేటప్పుడు సాయం చేసింది. జనావాసంలో తిరిగే నాయకులు కూడా తనకంటూ చిత్తశుద్ధితో పనిచేసే సైన్యాన్ని(కార్యకర్తలను) సిద్ధం చేసుకోవాలి. యుద్ధంలో గెలిచేంత వరకు రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, వానరులు వరకు ఉన్నారు. దీన్ని నాయకులు స్ఫూర్తిగా తీసుకుని తమ నియోజకవర్గంలో ఉన్న తమ పార్టీ నాయకులతో లక్ష్యం నెరవేరే వరకు కలుపుకుని వెళ్లాలి.
రాముడు పాటించిన ధర్మాన్ని తరతరాలు కథలుగా చెప్పుకుంటున్నాం. వనవాసం ముగిసిన తరవాతే పట్టాభిషేకం చేసుకున్నాడు. తాను అనుసరించిన విధానాన్ని నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచేందుకు మేనిఫెస్టో(Manifesto) రూపంలో హామీలు ఇచ్చి మరిచిపోరాదు. అలాగే ఓటర్లను ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ఈసీ నియమాలను పాటించి నిజాయితీగా గెలిచేందుకు ప్రయత్నించాలి.
దుష్ప్రచారం వదలాలి : యుద్ధాన్ని నీతిగా గెలిచిన వారే రాజు అవుతారు. ఈ ప్రక్రియలో ఎలాంటి చెడు వార్తలను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే అవి తిరిగి వారికే చుట్టుకుని వ్యక్తిత్వాన్ని దిగజారాలే చేస్తాయి. యుద్ధం ముగిసిన తరవాత సీతాదేవిపై నిందలు వేస్తే రాముడు సూచనలు మేరకు అగ్నిగుండంలోకి ప్రవేశించింది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి తన ప్రత్యర్థిపై లేనిపోని నిందలు వేస్తూ ప్రచారం కొనసాగిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని జోరుగా వ్యాప్తి చెందిస్తున్నారు. ఇలాంటివి చేయకుండా తన బలంపై నమ్మకం ఉంచుకుని ప్రచారంలో ముందుకు సాగాలి. సీతాదేవి ఏ విధంగా అగ్నిగుండం నుంచి పుణ్య స్త్రీగా బయటకి వచ్చిందో అదే విధంగా నాయకుడు ఓటింగ్ ప్రక్రియలో విజయానందంతో వెలిగిపోతాడు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హీట్ - జోరందుకున్న పార్టీల ప్రచారాలు - Lok Sabha Polls 2024
ధర్మాన్ని పాటించాలి : సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటే రాముడు అని చెప్పాల్సిందే. అలానే అభ్యర్థి మంచి వ్యక్తి అని పేరుపొందాలి. మంచి వాక్చాతుర్యం కలిగి ఉండాలి. జనారణ్యంలో నాటకీయంగా కాకుండా అండగా ఉండే వ్యక్తిలా ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి. ప్రత్యర్థిని బలహీనపరచడానికి ఎలాంటి తప్పుడు పనులు చేయరాదు. యుద్ధంలో నేగ్గేందుకు రావణుడు రాముడు బలాన్ని, బలహీనతను తెలుసుకునేందుకు వేగులను నియమించాడు. చివరికి పరాజయం పాలయ్యాడు. ఇలాంటి విషయంలో అభ్యర్ధులు జాగ్రత్తలు వహించాలి. రామాయణంలో జరిగిన ప్రతి ఘట్టం గురించి తెలుసుకోగల్గితే నాయకులు ఎన్నికల ప్రక్రియలో విజయానికి దారి దొరికినట్టే. ధర్మ మార్గాన నడిచిన రాముడికి హనుమంతుడు సాయం ఏ విధంగా ఉపయోగపడిందో, అలానే అభ్యర్థికి ప్రజల సాయం తోడవుతుంది.