High Court Hearing On Disqualification Petition : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశికెడ్డి, కె.పి వివేకానంద్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి ట్రైబ్యునల్ హోదాలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాతే, కోర్టులకు సమీక్షించే అధికారం ఉందని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఎళ్లిపోయిన ఎమ్మెల్యేలు తెల్లం ఎంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కడియం శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని, ఆ తీర్పు వెలువడిన తరువాతే కోర్టుల జోక్యం ఉంటుందన్నారు. స్పీకర్ నిర్ణయం వెలువరించకముందే న్యాయ సమీక్షపై నిషేధం ఉందన్నారు.
ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్
కిహోటో హోలోహన్ కేసుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు పదేళ్లు అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడు తక్షణం నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
దానం నాగేందర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనర్హతకు సంబంధించి చట్టసభలు నిర్ణయం తీసుకోవని, స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారన్నారు. స్పీకర్ నిర్ణయం తరువాతే కోర్టుల జోక్యం ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సుభాష్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో వెలువరించిన తీర్పులో ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలకు సుప్రీంకోర్టు సమాదానాలున్నాయిన్నారు. కిహోట్లో హోలోహాన్, రాజేంద్రసింగ్కు కేశం, మెగాచంద్రసింగ్ కేసుల గురించి కూడా ఇందులో పేర్కొన్నారు. ఆ తీర్పుల ప్రకారం స్పీకర్ నిర్దిష్టమైన గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. వాదనలు జరిగిన అనంతరం విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేశారు.
'ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ - అంకురార్పణ చేసిందే కాంగ్రెస్' - PARTY DEFECTIONS IN TELANGANA