Kuna Srisailam Goud Joins congress : బీజీపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కూన శ్రీశైలం గౌడ్, అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూన శ్రీశైలం గౌడ్ హస్తం పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డిలు కూన శ్రీశైలం గౌడ్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
Congress Party New Joinings : అంతకు ముందు చాలా రోజులుగా కూనతో కాంగ్రెస్ (Congress) నేతలు సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
Koona Srisailam Goud joined Congress Party : కుత్భుల్లాపూర్ ప్రాంతంలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన కూన శ్రీశైలం గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా మల్కాజిగిరి పార్లమెంటు స్థానాన్ని సునాయాసంగా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోడానికి అవకావం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం ఆదేశాల మేరకు గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూనను కలిసి సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇవాళ ఉదయం ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Congress Public meeting In Tukkuguda : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో భారీ బహిరంగ సమావేశాన్ని (public Meeting) ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రజలు భారీగా తరలివస్తారనే అంచనాలున్నాయి. మరోవైపు ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తుక్కుగూడలో జరిగే సభకు జన సమీకరణ చేసుకోవాల్సిన బాధ్యత లోక్‌సభ (Lok Sabha) అభ్యర్థులపైన ఉందని ఆయన ఇటీవలే స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి.. పార్టీ కండువా కప్పిన ఖర్గే
మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల