ETV Bharat / politics

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు - కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదు : కేటీఆర్ - కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్

KTR Visited Party Workers in Parakala : జై తెలంగాణ అన్నందుకు పోలీసుల థర్డ్ డిగ్రీలో గాయపడిన పార్టీ కార్యకర్తలను కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ చలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా వారిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పోలీస్​ స్టేషన్లకు పిలిపించి వేధిస్తే, బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు.

brs chalo medigadda tour
KTR Visited Party Workers in Parakala
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 5:18 PM IST

KTR Visited Party Workers in Parakala : హనుమకొండ జిల్లా పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల తీరుపై మాజీ మంత్రి మండిపడ్డారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అంబర్షాతో కేటీఆర్​ ఫోన్​లో మాట్లాడారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. కార్యకర్తలను పోలీస్​ స్టేషన్లకు పిలిపించి వేధిస్తే, బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మనదని గుర్తు చేశారు.

నేడే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు నేతలు రె'ఢీ'

స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినా, పార్టీ కార్యకర్తలపైన పోలీసుల దమనకాండ ఆగడం లేదని ఈ సందర్భంగా పరకాల నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పరకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. న్యాయస్థానాలతో పాటు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పరకాల వంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతమైనా పార్టీ యంత్రాంగం చూస్తూ ఊరుకోబోదని కేటీఆర్ స్పష్టం చేశారు.

చలో మేడిగడ్డ : భారత్ రాష్ట్ర సమితి బృందం ఇవాళ మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ పార్టీ ఈ పర్యటన చేపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలోని పియర్స్ కొన్ని కుంగాయి. అన్నారం ఆనకట్టలోనూ సీపేజీ సమస్య ఉత్పన్నమైంది. దీంతో రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదిలి రెండు ఆనకట్టలను ఖాళీ చేశారు.

మేడిగడ్డపై కాంగ్రెస్​ది రాజకీయం - రైతులకు నీళ్లివ్వకుండా కాలయాపన చేయడం దారుణం : కేటీఆర్

ఆనకట్టలో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని ఎన్​డీఎస్​ఏతో పాటు నిపుణులు చెప్పారని, మేడిగడ్డ, అన్నారంలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం అక్కడ పరీక్షలు కొనసాగుతుండగా, ఎన్​డీఎస్​ఏ సిఫార్సుల ప్రకారమే తాము తదుపరి కార్యాచరణ చేపడతామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ వాదనతో భారత్ రాష్ట్ర సమితి విభేదిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టలో కొన్ని పియర్స్ మాత్రమే కుంగాయని, ప్రభుత్వం మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును విఫలమైనదిగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు నేటి నుంచి చలో మేడిగడ్డకు కేటీఆర్ ఇటీవల పిలుపునిచ్చారు.

రేవంత్​కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.