ETV Bharat / politics

దేశం కోసం ఏదైనా విజన్​ ఉంటే చెప్పండి - సమాజంలో డివిజన్​ మాత్రం సృష్టించవద్దు : కేటీఆర్​ - KTR Tweet on PM Modi - KTR TWEET ON PM MODI

KTR Fires on PM Modi : రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ సమాజం పక్షాన బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ప్రశ్నలు సంధించారు. ఎక్స్​ వేదికగా పిరమైన మోదీ అంటూ వ్యాఖ్యానించారు. దయచేసి పవిత్రమైన తెలంగాణ నేలపై విషం చిమ్మకుండా దశాబ్ధకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి అని ట్వీట్ చేశారు.

KTR Tweet on PM Modi
KTR Fires on PM Modi
author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 2:50 PM IST

KTR Tweet on PM Modi Telangana Tour : 'దేశం కోసం ఏదైనా విజన్​ ఉంటే చెప్పండి కానీ దయచేసి సమాజంలో డివిజన్​ మాత్రం సృష్టించకండి. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి, దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లు అడగండి. ప్రధానిగా పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి. తెలంగాణ యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి. మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారు?' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్​ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.​

హైదరాబాద్​ ఐటీఐఆర్​ ప్రాజెక్టును ఆగం చేశారు : నవతరానికి కొండంత భరోసానిచ్చే హైదరాబాద్​ ఐటీఐఆర్​ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండని ఎక్స్​ వేదికగా ప్రధాని మోదీని కేటీఆర్​ అడిగారు. తెలంగాణ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండని నిలదీశారు. తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్​ కాలేజీ, ఒక్క నర్సింగ్​ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్​ ఐటీ కళాశాలను మంజూరు చేయలేదని మం డిపడ్డారు. ఒక్క ఐఐఎం, ఒక్క ఐకార్​, ఒక్​ ఎన్​ఐడీ ఎందుకు ఇవ్వలేదో చెప్పండని ప్రశ్నించారు.

'తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పండి. మండిపోతున్న నిత్యవసర ధరలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారో చెప్పండి. ముడి చమురు ధరలు తగ్గినా మోదీ హయాంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పండి. సబ్​ కాస సాత్​, అచ్చే దిన్​ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి. మీ పాలనలో పదేళ్లు గడిచినా ఇంకా ఉచిత రేషన్​ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పండని' ఎక్స్​ వేదికగా ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు.

సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పండని కేటీఆర్ అడిగ ారు. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా, కాంగ్రెస్​ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదని వాపోయారు. చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండని ప్రధాని మోదీని నిలదీశారు.

"అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పండి!! బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి!! దేశ ప్రధాన మంత్రిగా ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయకండి!! దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి! కానీ దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండి!! చివరగా ఒక మనవి రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవు! ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ!!" - కేటీఆర్​, ఎక్స్​ వేదికగా ట్వీట్

రేవంత్​రెడ్డి నువ్వు చీర కట్టుకుంటావా, రాహుల్​ గాంధీకి కట్టిస్తావా? - కేటీఆర్ సెటైర్

పార్లమెంట్ ఎన్నికల్లో 'చెయ్యి' విరిగిపోవాలే - 'పువ్వు' వాడిపోవాలే - కారు రయ్​మని ఉర్కాలే : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.