ETV Bharat / politics

రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయే : కేటీఆర్‌ - KTR Comments On CM Revanth Reddy - KTR COMMENTS ON CM REVANTH REDDY

KTR Comments On CM Revanth Reddy : బీఆర్ఎస్​ను బీజేపీలో విలీనం చేస్తారంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్​ఎస్​ సీనియర్​ నేత కేటీఆర్‌ మండిపడ్డారు. అదెప్పటికీ జరగదన్న మాజీమంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధాని మోదీకి మాట ఇచ్చినట్లు సమాచారం ఉందని అన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్, బీజేపీలో చేరతానని మాట ఇచ్చినందునే మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని ఆక్షేపించారు.

BRS Fires on Congress Govt
KTR Comments On CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 5:41 PM IST

Updated : Aug 17, 2024, 6:51 PM IST

KTR Sensational Comments On CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధానమంత్రి మోదీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని పేర్కొన్నారు.

తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభం అయిందని, బీజేపీ జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయం చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని కేటీఆర్ అడిగారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు.

తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ విస్తరణ హుష్‌కాకి అయ్యిందా? : సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్​రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించిన ఆయన, ప్రభుత్వ ఆస్తులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తే పోలీసులు ఏం చేయాలని అడిగారు. ప్రభుత్వ ఆస్తులపై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంకు సంబంధించిన మీడియా వాళ్లు ఒక ఐపీఎస్ అధికారిపై దాదాపుగా దాడికి వెళ్లారని, ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని కోరారు.

ఫాక్స్ కాన్ ప్రతినిధులతో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారని, కేసీఆర్ సమక్షంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఫాక్స్ కాన్ గతంలో ఒప్పందం చేసుకొందని గుర్తు చేశారు. ఇపుడు బెంగళూరులో అతి పెద్ద ప్లాంటు అంటున్నారు. మరి తెలంగాణలో విస్తరణ హుష్ కాకి అయిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. చూస్తోంటే ఫాక్స్ కాన్ విస్తరణ ఆగిపోయినట్లుందని, సీఎం చేస్తున్న ప్రచారం ఆధారంగా ఫాక్స్ కాన్ కూడా వెళ్లిపోయిందా? రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసాపై రైతుల్లో భరోసా పోయిందని, రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా చేస్తారని అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతా : కేటీఆర్‌ - KTR Responded Commission Notices

'రుణం తీరలే - రైతు బతుకు మారలే - ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే బెదిరింపులు' - KTR Comments On Loan waiver

Last Updated : Aug 17, 2024, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.