ETV Bharat / politics

మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చా - కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరి సరికాదు : కేటీఆర్ - KTR on Women Commission Investigate

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 1:49 PM IST

Updated : Aug 24, 2024, 7:01 PM IST

KTR on Women Commission : మహిళా కమిషన్​ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యానని కేటీఆర్​ తెలిపారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అంతకుముందు హైదరాబాద్​లోని బుద్ధ భవన్​లో కేటీఆర్​ను మహిళా కమిషన్​ విచారించింది.

Women Commission Investigate KTR
Women Commission Investigate KTR (ETV Bharat)

Women Commission Investigate KTR : మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చానని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తెలిపారు. విచారణకు వస్తే మహిళా కాంగ్రెస్​ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. మహిళా కమిషన్​ కార్యాలయం వద్ద బీఆర్​ఎస్​ మహిళా నేతలపై దాడి చేశారని కేటీఆర్​ ఆరోపించారు. హైదరాబాద్​లోని బుద్ధభవన్​లో మహిళా కమిషన్​ కేటీఆర్​ను విచారించింది.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ, మహిళా కమిషన్​ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యానని​ అన్నారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని పేర్కొన్నారు. మాట దొర్లినందుకు చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను క్షమాపణలు కోరినట్లు చెప్పారు. అంతకుముందు విచారణకు హాజరైన కేటీఆర్​కు మహిళా కమిషన్​ సభ్యులు రాఖీ కట్టారు. కేటీఆర్​ విచారణ సందర్భంగా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మహిళా సభ్యుల మధ్య పరస్పరం తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

కేటీఆర్​ క్షమాపణలు మహిళా కమిషన్​ స్వీకరణ : రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను కమిషన్​కు వివరించేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. అయితే, ఇవాళ ఒక్క అంశానికి మాత్రమే పరిమితం కావాలని, మిగతా అంశాలపై తర్వాత కలవాలని ఛైర్​పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. సమన్లకు లోబడి కేటీఆర్ హాజరై వివరణ ఇచ్చారని, తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతోపాటు క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. అటువంటి వ్యాఖ్యలు సరికాదని కూడా కేటీఆర్ అభిప్రాయపడినట్లు పేర్కొంది.

కేటీఆర్ క్షమాపణలను అంగీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్, భవిష్యత్​లో ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకుంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాల విషయమై కమిషన్ సూచించినట్లు మరోమారు కలుస్తామన్న కేటీఆర్, ఇవాళ మహిళా కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. తమ పార్టీ మహిళా నాయకురాళ్లపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నేతల వైఖరిని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఖండించారు. మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​కు కేసీఆర్ హయాంలో కేబినెట్ హోదా ఇచ్చారని, ఈ ప్రభుత్వం కూడా ఆ హోదా కల్పించాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోరారు.

"షాద్ నగర్​లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చెంచు మహిళపై దాడి జరిగింది. గురుకుల హాస్టళ్లలో విద్యార్థినులు చనిపోతున్నారు. ఈ సంఘటనను మహిళ కమిషన్ దృష్టికి తెస్తే మళ్లీ రావాలని కోరారు. తప్పకుండా వారు కోరినట్లుగా మళ్లీ సమయం తీసుకొని వస్తాం. నేను ఇచ్చిన వివరణపై కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. తప్పు చేస్తే క్షమాపణ అడగాలి. నేను అందుకే ఒక మాట దొర్లితే మహిళలను గౌరవించే వ్యక్తిగా క్షమాపణ అడిగాను." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

బస్సుల్లో అల్లికలే కాదు, బ్రేక్ డ్యాన్సులు కూడా వేసుకోవచ్చు: మంత్రి సీతక్కకు కేటీఆర్ కౌంటర్ - KTR VS SEETHAKKA

Last Updated : Aug 24, 2024, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.