ETV Bharat / politics

బీఆర్​ఎస్​ను 10 సీట్లలో గెలిపిస్తే - 6 నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారు : కేటీఆర్ - KTR ON LOK SABHA ELECTIONS 2024 - KTR ON LOK SABHA ELECTIONS 2024

KTR Road Show in Sircilla : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూళ్లు చేసిందని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని కమలం పార్టీ నేతలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

KTR Shocking Comments on BJP
KTR Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 12:40 PM IST

Updated : May 6, 2024, 2:30 PM IST

బీఆర్​ఎస్​ను 10 సీట్లలో గెలిపిస్తే - 6 నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారు : కేటీఆర్

KTR Road Show in Sircilla : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్​కు 10- 12 ఎంపీ సీట్లు కట్టబెడితే రాబోయే ఆరు నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి తప్పక వస్తుందని మాజీమంత్రి కేటీఆర్‌ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లోంచి 16 జిల్లాలను తీసెయ్యాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌ లోక్‌సభ పార్టీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా సిరిసిల్లలో కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

KTR Shocking Comments on BJP : బీజేపీ నేతలు పదేపదే నమో నమో అంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. నమో అంటే నరేంద్ర మోదీ కాదని, నమో అంటే నమ్మించి మోసం చేయడం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లు, పేదలను పీడించి పెద్దలకు లబ్ధి చేకూర్చిన ఘనత మోదీకే దక్కుతుందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని అన్నారు. అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్‌, అవ్వ మధ్య ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్ - KTR conversation in Siricilla

"కరీంనగర్‌ స్థానంలో పోటీ కాంగ్రెస్‌తో కాదు. ఎన్నికల్లో బీఆర్ఎస్​ను 10- 12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారు. మోదీ సెస్సుల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని కొత్త పన్నులు వసూలు చేశారు. హైవేల కోసం పన్నులు వేశామని సమర్థించుకున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ అమలు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్​ రెడ్డి అబద్ధాలు చెప్పి గెలిచారు. జిల్లాలను తగ్గించాలని చూస్తున్నారు. " - కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR Meeting at Sircilla : రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిన మోదీకి ఓటు ఎందుకు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదేళ్లలో బండి సంజయ్‌ సిరిసిల్లకు ఏమైనా పనులు చేశారా అని నిలదీశారు. కేసీఆర్‌ రుణం తీర్చుకునే అవకాశం ప్రజలకు వచ్చిందని, ఈ ఎన్నికల్లో 10- 12 స్థానాల్లో బీఆర్ఎస్​ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దొంగ హామీలకు మద్దతిచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు. హస్తం నాయకులకు ఓటుతో బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. గులాబీ కండువానే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు.

రేవంత్​రెడ్డి నువ్వు చీర కట్టుకుంటావా, రాహుల్​ గాంధీకి కట్టిస్తావా? - కేటీఆర్ సెటైర్ - ktr on mahalakshmi scheme

కొత్త జిల్లాలు కొనసాగించకపోతే కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం తప్పదు : కేటీఆర్ - BRS Leader KTR Fires on CM Revanth

Last Updated : May 6, 2024, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.