KTR on BC Caste Census : బీసీ కులగుణనకు బిల్లు ప్రవేశపెడితేనే కార్యక్రమం ఫలప్రదం అవుతుందని మాజీమంత్రి కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ పెట్టాలని గతంలో డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నుంచి ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖపై రెండుసార్లు తీర్మానాలు చేసి పంపినట్లు తెలిపారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ పెట్టాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు.
కేంద్రంలో ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లయినా వస్తాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు(BC Caste Census) తీర్మానం కాకుండా.. బిల్లు ద్వారా చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్ అయినా వేయాలని డిమాండ్ చేశారు. బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కులగణన కోసం బిల్లు తెస్తే మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం - సభ వాయిదా
Gangula on BC Caste Census : కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలని మాజీమంత్రి గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని, న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలని అసెంబ్లీలో పేర్కొన్నారు. కులగణనను ఏ శాఖతో నిర్వహిస్తారు. ఏవిధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలని, కులగణన విధివిధానాలపై అఖిలపక్షంతో చర్చించాలని పేర్కొన్నారు.
కేంద్రం పరిధిలోని అంశంపై రాష్ట్రం ఎలా చట్టం చేస్తుందో తెలపాలని, రిజర్వేషన్లు 50 శాతం మించిపోతే ఏం చేస్తారో స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో చేసిన కులగణనకు న్యాయపరంగా చిక్కులు వచ్చాయని, మన వద్ద అటువంటి చిక్కులు రాకుండా చట్టం ఉండాలన్నారు. జనాభా ఆధారంగా చట్టసభల్లో 50 శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
CPI on BC Kula Ganana : మరోవైపు కులగణన తీర్మానంపై సీపీఐ హర్షం వ్యక్తం చేసింది. వెనుకబడిన వర్గాలకు ఈ కులగణనతో లబ్ధి చేకూరుతుందని భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. తాము బీసీ కులగణనను బలపరుస్తున్నట్లు తెలిపారు. కానీ కులగణను తీర్మానంలా కాకుండా బిల్లురూపంలో తీసుకురావాలని తెలిపారు.
"రాష్ట్రప్రభుత్వం బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలి. బీసీ కులగణనకు చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది. కులగణనపై న్యాయ విచారణ కమిషన్ వేయాలి. బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి. కులగణన కోసం బిల్లు తెస్తే మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది. - కేటీఆర్, మాజీమంత్రి
రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
భూకంప అధ్యయనం లేకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం : కాగ్