KTR Interesting Comments on MP Elections : రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలించిన 100 రోజుల్లోనే ప్రజలకు నమ్మకం పోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 10 స్థానాల్లో గెలిపిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
KTR Fire on PM Modi : రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పమంటే చెప్పలేక చేసిన అభివృద్ధి చూపలేక జై శ్రీరామ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. దేవుడు అందరివాడని, కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాదని తెలిపారు. దేవుడి అక్షింతలతో కమలం పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి మోదీ అక్షింతలు పంపితే, దేశానికి సరిపడే మూడున్నర కోట్ల వరి ధాన్యం పంపిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
చేవెళ్లలో గులాబీ జెండా మరోమారు ఎగరడం ఖాయం : కేటీఆర్ - KTR on Chevella Constituency
KTR Comments on Congress : కాంగ్రెస్ మీద నమ్మకం వంద రోజుల్లోనే పోయిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి కష్టాలు రెట్టింపు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసాలు బాగాలుగా, విడతల వారీగా వస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్ 9న చేస్తామన్న రైతు రుణమాఫీ, పంద్రాగస్టులోపు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్టుగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించాలని, కోటీ 65 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇవ్వాలని, రూ.4000 పింఛన్ అర్హులు అయిన వారి ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు.
"10 ఎంపీ స్థానాలు బీఆర్ఎస్కు ఇవ్వండి. రాజకీయాల్లో చాలా మార్పులు చేస్తాం. కాంగ్రెస్ మోసం, బీజేపీ ద్రోహం, కేసీఆర్ నిజాయతీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. కాంగ్రెస్ మీద నమ్మకం 100 రోజుల్లోనే పోయింది. దేవుడు అందరివాడు. బీజేపీకి మాత్రమే పరిమితం కాదు. అక్షింతలతోనూ కమలం పార్టీ రాజకీయాలు చేస్తుంది." కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు