KTR on Rahul Gandhi Meet Youth in Ashok Nagar : రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్‌లోని యువతకు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ రాహుల్ గాంధీనుద్దేశించి ఎక్స్‌లో ఎనిమిది నెలలు అయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో యువత ఆందోళన చేస్తోందని పెర్కొన్నారు.
పోరాటం మాకు కొత్త కాదు ✊
— KTR (@KTRBRS) August 3, 2024
ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం
వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0
పోరాటం మాకు కొత్త కాదు ✊
— KTR (@KTRBRS) August 3, 2024
ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం
వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0
జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటలు నమ్మి తెలంగాణ యువత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. పోరాటం మాకు కొత్తకాదన్న కేటీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే దిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతామన్నారు. వదిలిపెట్టం, కాంగ్రెస్ నేతలు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో యువతను కలిశారు. పోటీ పరీక్షల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'దొరల' కేసీఆర్ సర్కార్ కింద తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను హైదరాబాద్ అశోక్‌నగర్‌లో సెంట్రల్ లైబ్రేరీలో నిరుద్యోగులను కలిశారని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి విపులంగా తెలుసుకున్నారని తన ఎక్స్(ట్వీటర్) వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
Telangana’s youth are suffering immensely under 'Dorala' KCR sarkar, my recent visit to Ashok Nagar, Hyderabad made that crystal clear.
— Rahul Gandhi (@RahulGandhi) November 27, 2023
Our ‘Job Calendar’ is the first step in easing their pain. We will ensure:
✅ 2 lakh Govt Jobs in 1 year
✅ Revamp of TPSC on UPSC lines
✅… pic.twitter.com/12PDdTnDM9
Rahul Gandhi Visit Central Library in Hyderabad : నిరుద్యోగ యువత బాధను తగ్గించేందుకు తమ కాంగ్రెస్ ‘ఉద్యోగ క్యాలెండర్’తో తొలి అడుగు ముందుకు వేసిందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఇచ్చారు. యూపీఎస్సీ మాదిరి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. యువ వికాసం కింద విద్యార్ధులకు రూ.5 లక్షల సహాయం.. యువత భవిష్యత్తు కాంగ్రెస్ ప్రజా సర్కార్ చేతిలో భద్రంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తమదే గ్యారెంటీ! అని స్పష్టం చేశారు.
ఇది జాబ్ క్యాలెండర్ కాదు జోక్ క్యాలెండర్: హరీశ్ రావు
తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల - ఏ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయంటే? - Telangana Job Calendar 2024