KTR Tweet On Telangana Agriculture Issues : కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం అయితే కాంగ్రెస్ రాగానే వ్యయసాయానికి గడ్డుకాలం వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని, ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతం ఇదేనని పేర్కొన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు.
కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం..
— KTR (@KTRBRS) August 12, 2024
కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..
ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్
తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్
ఒక్క ఏడాదిలోనే..
15.30 లక్షల ఎకరాల్లో
తగ్గిన సాగు విస్తీర్ణం..
ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు..
తొలి ప్రమాద… pic.twitter.com/2iyQGw8RSP
మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు : మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీ రైతుల సంఖ్య కట్, నేడు సాగుచేసే భూ విస్తీర్ణం కట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితని కేటీఆర్ ఆక్షేపించారు. బురద రాజకీయాలు తప్ప, కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. కొత్త రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఇవన్నీ తెలంగాణలో సాగు విస్తీర్ణం తగ్గటానికి కారణాలని ఎక్స్ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు.
More than 10 days since #Sunkishala mishap. Why is there no action initiated on the agency Megha Engineering & Infrastructure Limited !?
— KTR (@KTRBRS) August 12, 2024
Any answers why your Government is hushing up and going soft on the agency @RahulGandhi Ji ? pic.twitter.com/Mp5EXwJkoH
KTR Respond on Sunkishala Project Incident : సుంకిశాల ప్రమాదం జరిగి పది రోజులకు పైగా గడిచినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆక్షేపించారు. ఇప్పటి వరకు పనులు చేసిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో, సంస్థ పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోందో రాహుల్ గాంధీ చెప్పగలరా అని ఎక్స్ వేదికగా నిలదీశారు.