KTR At Ambedkar Jayanthi Celebrations : ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేడ్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పదేళ్లు తమ ప్రభుత్వం పని చేసిందని తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు (BR Ambedkar Jayanthi Celebrations) సందర్భంగా తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బాబా సాహెచ్ అంబేడ్కర్ చెప్పినట్లే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్ల పాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామని కేటీఆర్ తెలిపారు. విద్యతోనే వికాసం వస్తుందని అన్నారు. వికాసంతోనే ప్రగతి వస్తుందని పేర్కొన్నారు. ప్రగతితోనే సమానత్వం వస్తుందని అన్న ఆయన ఆలోచనతో 1022 గురుకులాలు పెట్టుకున్నామని వివరించారు.
Ambedkar Statue: సాగర తీరాన.. త్రీడీ వెలుగుల్లో కాంతులీనుతున్న అంబేడ్కర్ విగ్రహం
KTR on Ambedkar Statue : గురుకులాల నుంచి బయటకు వచ్చిన లక్షల మంది భవిష్యత్తు తెలంగాణ పౌరులు ఈరోజు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. వీరందరూ జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలుగుతాయని వెల్లడించారు. అతిపెద్ద 125 అడుగుల బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని(125 ft Ambedkar Statue) ఏర్పాటు చేశామని హర్షం వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదని విప్లవం అని ఉద్ఘాటించారు.
"పదేళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అంబేడ్కర్ చెప్పిన బాటలోనే ప్రయాణం చేయడానికి బలంగా ప్రయత్నం చేశాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేడ్కర్ చెప్పారు. దానికి అనుగుణంగానే విద్యతోనే వికాసం వస్తుంది. వికాసం వల్లనే ప్రగతి వస్తుంది. ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచనతోనే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. 1005 జూనియర్ కాలేజ్‌లు పెట్టుకున్నాం. 88 డిగ్రీ కాలేజ్‌లు పెట్టుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేడ్కర్ ఆశయంతోనే కేసీఆర్ కూడా ఆనాడు ఆ కార్యక్రమాలు చేశారు." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
sand art Of Ambedkar : అద్భుతంగా అంబేడ్కర్ శాండ్ ఆర్ట్..
KCR about Ambedkar Jayanti : 'అంబేడ్కర్ రచనలు ప్రపంచాన్నే ఆలోచింపజేశాయి'