Korukanti Chandar Fires On Congress : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్ధతుగా ఆయన పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40,41వ డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
Koppula Eswar Election Campaign : డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రశ్నించే గొంతుకైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గాదం విజయతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీహామీలు నెరవేరాలంటే కొప్పుల గెలవాలి : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే వారిపై ప్రశ్నించేందుకు కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు రెండు లక్షల మందిని ప్రభావితం చేస్తారన్నారు. కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించుకుంటామని కార్మిక వర్గం అంతా చెబుతుందన్నారు. ఓటు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గెలిపించిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని కోరారు.
"ప్రచారంలో భాగంగా ఏ గడపకు వెళ్లినా తాము ఎమ్మెల్యే ఎన్నికల్లో మోసపోయామని ప్రజలు చెబుతున్నారు. ఐదు నెలల్లో ఏ విధంగా పరిపాలన చేశారో కళ్లారా చూశామని ప్రజలు తెలిపారు. పదేళ్ల పాటు కేసీఆర్ పాలన చాలా గొప్పగా ఉండేది అని ప్రజలు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేకుండా చేసేందుకు కేసీఆర్ కృషిచేశారు. ప్రజలనే రాజులుగా చేసినటువంటి కేసీఆర్ పాలన మళ్లీ రావాలని వారు కోరుకుంటున్నట్ల తెలిపారు"- కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నేత
BRS Speed Up Election Campaign : మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే కారుపార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలు, రోడ్ షోలు చేపడుతుండగా ఆ పార్టీ నాయకులు కూడా ఆదే బాటలో పయనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తమను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
'కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మితే మోసపోతాం - అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు'