ETV Bharat / politics

కుటుంబ దగా వల్లే కవిత బలైంది - త్వరలోనే జైలుకు కేసీఆర్​, కేటీఆర్​? : మంత్రి కోమటిరెడ్డి - Minister Komatireddy Counter to KCR - MINISTER KOMATIREDDY COUNTER TO KCR

Minister Komatireddy Counter to KCR : కేసీఆర్​, కేటీఆర్​ త్వరలో జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూమ్​ కట్టించి వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అంటే ఏంటో చూస్తారంటూ హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Minister Komatireddy Fires on KCR
Minister Komatireddy Fires on KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 1:10 PM IST

Updated : Apr 17, 2024, 3:27 PM IST

కుటుంబ దగా వల్లే కవిత బలైంది - త్వరలోనే జైలుకు కేసీఆర్​, కేటీఆర్​? : మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Counter to KCR : ఎన్నికల కోడ్​ వల్ల రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేకపోయామని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్​ ముగిశాక అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. కేసీఆర్​, జగన్​ కుట్రల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనాలని బీఆర్​ఎస్​ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్​ఎస్​కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని సవాల్​ విసురుతున్నానని పేర్కొన్నారు. దమ్ముంటే కాంగ్రెస్​ను, ఆ పార్టీ నేతలను టచ్​ చేసి చూడండి(Komatireddy Challenge to KCR) అంటూ సవాల్ విసిరారు. నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బీఆర్​ఎస్​ను పునాదులతో సహా లేపేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి హెచ్చరించారు. మూడు నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్​ఎస్​లో మిగులుతారని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్​, బీజేపీ(Congress Vs BJP) మధ్యేనని స్పష్టం చేశారు. 12 నుంచి 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​కు ఒక్క ఎంపీ సీటు వచ్చినా తాను దేనికైనా సిద్ధమని సవాల్​ విసిరారు. కేసీఆర్​ కుటుంబ దగా వల్ల కవిత బలైపోయిందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్‌

కేసీఆర్​, కేటీఆర్​ త్వరలో జైలుకు : కేసీఆర్​, కేటీఆర్​ త్వరలో జైలుకి పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూమ్​ కట్టించి స్వాగతం పలుకుతామని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అంటే ఏంటో చూపిస్తా అంటూ బీఆర్​ఎస్​ పార్టీపై ఫైర్ అయ్యారు.

"12 నుంచి 13 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ ముందుకు వెళుతుంది. సుమారు 15 సీట్లను టార్గెట్​గా పెట్టుకున్నాం. ఎన్నికలయిన మూడు నెలల్లో బీఆర్​ఎస్​ పార్టీ దుకాణం బంద్​ అవుతుంది. ఆ పార్టీ ఉండదు. కవిత జైలుకు వెళ్లేసరికి ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాగో రెండు నెలలు వరకు బెయిల్​ రాదు. కేసీఆర్​, కేటీఆర్​ కూడా త్వరలో జైలుకు వెళ్తారు. చర్లపల్లి జైలులోనే డబుల్​ బెడ్​రూం మీ కోసం సిద్ధం చేస్తాం." - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మంత్రి

మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు : నల్గొండ ప్రభుత్వాసుపత్రిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న మతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ల హాజరు పట్టిక, ట్రీట్​మెంట్​ పేషెంట్ల వివరాలు అడిగి వాటిని పరిశీలించారు. ఆసుపత్రి భవన నిర్మాణం చేపడతామని, ఆ నిర్మాణాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం రేవంత్‌ బీజేపీలోకి ఎందుకు వెళ్తారు? - కేసీఆర్​కు కాంగ్రెస్ మంత్రుల కౌంటర్

కాంగ్రెస్​లో శిందేలు లేరు - రేవంత్​ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారు : మంత్రి కోమటిరెడ్డి

Last Updated : Apr 17, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.