ETV Bharat / politics

ఇక్కడ ఒక్కసారి గెలిస్తే - ఇంకోసారి విజయం పక్కా - ఆనవాయితీని కొనసాగించిన కిషన్​ రెడ్డి - Secunderabad Lok Sabha Poll Results 2024 - SECUNDERABAD LOK SABHA POLL RESULTS 2024

Kishan Reddy Win Secunderabad Lok Sabha Poll : సికింద్రాబాద్‌ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి పాత ఒరవడి రిపీట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నాలుగున్నర దశాబ్దాల్లో ఒక్కసారి ఇక్కడ ఎంపీగా గెలిస్తే మరోసారి కూడా అవకాశం ఇచ్చేవారు. కిషన్‌ రెడ్డి సైతం ఈ కోవలోకి వచ్చి చేరారు. ఈ స్థానం నుంచి 2019లో విజయం సాధించగా, తాజాగా వెలువడిన ఫలితాల్లో మరోసారి ఆయన విజయ బావుటా ఎగురవేశారు.

Secunderabad Lok Sabha Poll Results 2024
Secunderabad Lok Sabha Poll Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 2:09 PM IST

Telangana Lok Sabha Election Results 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 సీట్లను కట్టబెట్టారు. డబుల్ డిజిట్ స్థానాల్లో పాగా వేయాలని భావించిన కమలం పార్టీ సింగిల్ డిజిట్ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఒక దఫా ఎంపీగా గెలిస్తే మరోసారి అవకాశం కల్పించడం సికింద్రాబాద్‌ ప్రత్యేకతని చెప్పవచ్చు. నాలుగున్నర దశాబ్దాల్లో ఒక్కసారి మినహాయిస్తే, అన్నిసార్లు ఇదే తంతు రిపీట్‌ అయింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డికి సైతం రెండోసారి పార్లమెంట్‌ సభ్యుడిగా అవకాశం కల్పించారు. దీంతో పాత ఒరవడి పునరావృతమైనట్లైంది.

Lok Sabha Election Results 2024 : ప్రస్తుత హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ మాత్రం 4 సార్లు సికింద్రాబాద్ స్థానం నుంచి విజయం సాధించడం విశేషం. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో ఇప్పటి వరకు రెండేసిసార్లు గెలిచిన వారే ఎక్కువ. 1979, 1980లలో సికింద్రాబాద్‌ ఎంపీ స్థానం నుంచి పి.శివశంకర్‌ గెలుపొంది, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1984లో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం టి.అంజయ్య గెలిచారు. ఆయన హఠాన్మరణంతో 1987లో ఉప ఎన్నిక జరిగింది. దీంతో అంజయ్య సతీమణి మణెమ్మ విజయం సాధించగా, 1989లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె మళ్లీ గెలుపొందారు.

రెండుసార్లు ఎంపీగా గెలిచిన వారి సరసన కిషన్‌రెడ్డి : 1991లో బండారు దత్తాత్రేయ తొలిసారిగా గెలిచారు. 1996లో ఓటమి పాలైనప్పటికీ 1998, 1999, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో దేశ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ రాజేశ్వర్‌రావు విజయం సాధించినప్పటికీ, మళ్లీ గెలవలేదు. 2004లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచిన అంజన్‌కుమార్‌ యాదవ్‌ను 2009 ఎన్నికల్లోనూ విజయం వరించింది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన కిషన్‌రెడ్డి ప్రస్తుతం కూడా విజయదుందుభి మోగించి రెండుసార్లు ఎంపీగా గెలిచిన వారి సరసన చేరారు.

టీమ్ వర్క్‌ - మోదీ చరిష్మాతో మరోసారి విజయకేతనం : ఈ దఫా లోక్​సభ ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ పక్కా ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం ముందుకెళ్లడంతో పాటు కార్యకర్తల టీమ్ వర్క్‌ కిషన్‌రెడ్డి విజయానికి ప్రధానంగా దోహదపడింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా ఆయన విజయానికి కారణమైంది. సరిగ్గా మూడు నెలల ముందే ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ విజయాలతో పాటు సికింద్రాబాద్‌ ఎంపీగా తాను చేపట్టిన పనులను వివరించడంలో కిషన్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. దీంతో ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు.

ఎంతైనా గ్రేటర్ ఓటర్ల తీరే వేరయా - చేతికి షాక్, వికసించని గులాబీ, హ్యాట్రిక్ కొట్టిన కమలం - Greater Hyderabad Lok Sabha Election Results 2024

కాంగ్రెస్​కు గట్టి పోటీనిచ్చిన కమలదళం - ఓటు షేరింగ్​ ఎంతో తెలుసా? - BJP WINNING SEATS IN TELANGANA LOK SABHA ELECTIONS

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.