ETV Bharat / politics

యువ నాయకుడి నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు - కిషన్​ రెడ్డి పొలిటికల్​ జర్నీ - Kishan Reddy Oath as a Central Minister - KISHAN REDDY OATH AS A CENTRAL MINISTER

Kishan Reddy Oath as a Central Minister : కేంద్రంలో బీజేపీ పార్టీ మళ్లీ మూడోసారి అధికారం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో మంత్రి వర్గ కొలువులో రాష్ట్ర బీజేపీ నాయకులు ఇద్దరికి అవకాశం దక్కింది. అందులో ఒకరు కిషన్​ రెడ్డి, మరొకరు బండి సంజయ్​. కిషన్​ రెడ్డి మూడోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Kishan Reddy Life Story
Kishan Reddy Oath as a Central Minister (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 8:43 PM IST

Updated : Jun 9, 2024, 8:57 PM IST

Kishan Reddy Oath as a Central Minister : బీజేపీలోకి ఒక సాధారణ యువనాయకుడిగా ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎదిగి తన నాయకత్వాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పారు. నిత్యం ప్రజల సమస్యల తరుఫున పాటుపడుతూ, పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తనను అభివృద్ధి చేసుకుంటు ఎదిగిన వ్యక్తి. సాధారణ నాయకుడి నుంచి కేంద్ర మంత్రి పదవి అది కూడా మూడోసారి బాధ్యతలు చేపట్టారు, అతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో తన గళం వినిపిస్తూ పోరుయాత్ర చేసిన మహానీయుడు. రాష్ట్ర అభివృద్ధే తన జీవిత లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని నిత్యం సమస్యలను ఎత్తు చూపుతూ ముందడుగు వేశారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం.

Kishan Reddy Life Story : స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. 1995లో వివాహం చేసుకున్నారు. జయప్రకాశ్‌ నారాయణ స్పూర్తితో జనతా పార్టీ యువకార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు బీజేవైఎం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు పని చేశారు.

Kishan Reddy Political Career : 1990 నుంచి 1992 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 1992 నుంచి 1994 వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా 1994 నుంచి 2001వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2003 నుంచి 2005 వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY

Kishan Reddy Political Career After MLA : కిషన్​ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో అడుగుపెట్టారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో 1016 ఓట్లతో ఓడిపోయారు.

Kishan Reddy Political Career as a MP : : 2019లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో మొదటిసారి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో 2019 నుంచి 2021 వరకు కొనసాగారు. అనంతరం ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం మెచ్చి 2021లో స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. 2023లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు. 2024 వరకు రెండో కేంద్ర మంత్రి పదవిలో కొనసాగారు. మళ్లీ 2024లో సికింద్రాబాద్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ అత్యధిక మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది.

ఇక్కడ ఒక్కసారి గెలిస్తే - ఇంకోసారి విజయం పక్కా - ఆనవాయితీని కొనసాగించిన కిషన్​ రెడ్డి - Secunderabad Lok Sabha Poll Results 2024

Last Updated : Jun 9, 2024, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.