ETV Bharat / politics

రుణమాఫీ అమలుకు పంద్రాగస్టు వరకు ఎందుకు? - గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ గారడీ చేస్తోంది : కిషన్​ రెడ్డి - Kishan Reddy on Election Campaign - KISHAN REDDY ON ELECTION CAMPAIGN

Kishan Reddy Interesting Comments on BRS : గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో బీఆర్ఎస్​ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో అన్ని విషయాల్లో బీజేపీ ముందుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ఈ నెల 25న రాష్ట్రానికి కేంద్రమంత్రి అమిత్ షా వస్తారని వెల్లడించారు.

Kishan Reddy on Election Campaign 2024
Kishan Reddy Interesting Comments on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 7:10 PM IST

Updated : Apr 20, 2024, 7:17 PM IST

కేసీఆర్‌ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేక పోతున్నారు కిషన్​రెడ్డి

Kishan Reddy Interesting Comments on BRS : లోక్​సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా బీజేపీ ముందంజలో ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్​ చాలా బలహీనపడిపోయిందని, దాదాపు కనుమరుగైందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌కు ఎవరూ ఓటు వేయొద్దని అన్నారు. హైదరాబాద్​లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Kishan Reddy Comments on KCR: రాష్ట్రంలో ఇప్పటికే ఐదు సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారని కిషన్​రెడ్డి అన్నారు. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్​ చాలా బలహీనపడిందని, ఆ పార్టీ దాదాపు కనుమరుగైందని అన్నారు. ఆ పార్టీ ఓడిపోయి 5 నెలలు గడిచినా, ఓటమిని కేసీఆర్‌, కేటీఆర్ ఇంకా అంగీకరించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్‌ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ కేసు, ఫోన్ల ట్యాంపింగ్‌ కేసుల్లో బీఆర్ఎస్​ కూరుకుపోయిందని వివరించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీజేపీని విమర్శిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్​కు ఓటు అడిగే హక్కు లేదు - గ్యారంటీల అమలులో విఫలంపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలి : కిషన్​ రెడ్డి - lok sabha elections 2024

Kishan Reddy Fire on congress : గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో బీఆర్ఎస్​ ఉందని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్​లోకి పంపారని, ఇప్పుడు బీఆర్ఎస్​లో గెలిచిన ఎమ్మెల్యేలను హస్తం పార్టీలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ లిక్కర్‌ కేసుతో తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడలేదని ఆరోపించారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ మేనిఫెస్టో : కిషన్​ రెడ్డి - Kishan Reddy on BJP Manifesto 2024

'రాష్ట్రంలో జూన్ 4న ఎన్నికల కోడ్​ ముగుస్తుంది. జూన్ 5 నుంచి పథకాలు అందజేయొచ్చు కదా? ఆగస్టు వరకు పెండింగ్ పెట్టడం ఎందుకు? కాంగ్రెస్, బీఆర్ఎస్​ కవల పిల్లల లాంటివి. నాలుగున్నర సంవత్సరాల తరువాత కాంగ్రెస్ కనుమరుగవ్వడం ఖాయం. తెలంగాణలోనూ డబుల్ డిజిట్ స్థానాలు బీజేపీవే. 25వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు." - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy on Runamafi Telangana : ఆరు గ్యారంటీలను అమలు చేసేంత వరకు హస్తం గుర్తుకు ఎవరూ ఓటు వేయొద్దని కిషన్ ​రెడ్డి సూచించారు. వంద రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ అయిపోగానే రుణమాఫీ చేయకుండా ఆగస్టు 15 వరకు ఎందుకు ఆగాలని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం రేవంత్‌ అబద్ధాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ గారడీ చేసి ఓట్లు దండుకుందని అన్నారు. అనంతరం బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​కు బీ ఫామ్ అందజేశారు.

పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు కేటాయించింది : కిషన్ రెడ్డి - KISHAN REDDY ON CENTRAL FUNDS

లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్న కమలం - కిషన్​ రెడ్డి వైఖరే కారణం! - Lok sabha election 2024

Last Updated : Apr 20, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.