ETV Bharat / politics

గ్యారెంటీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్​కు లేదు : కిషన్​రెడ్డి - kishan Reddy Fires On Congress - KISHAN REDDY FIRES ON CONGRESS

kishan Reddy Fires On Congress Party : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్​సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లను ముద్రించే మిషన్లు పెడతారా అని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు.

kishan Reddy Fires On Congress Party
kishan Reddy Fires On Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 5:52 PM IST

Updated : Apr 5, 2024, 6:43 PM IST

kishan Reddy Fires On Congress Party : శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు(Congress Party) లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. డిక్లరేషన్లు, గ్యారంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై కిషన్​రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. అంతకు ముందు బాబు జగ్జీవన్​రామ్ జయంతి వేడుకల్లో మంత్రి కిషన్​రెడ్డి పాల్గొని అనంతరం మాట్లాడారు.

నోట్లను ముద్రించే మిషన్లు పెడతారేమో : కిషన్​రెడ్డి
ఇచ్చిన హామీలను(congress Guarantees) అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లను ముద్రించే మిషన్లు పెడతారేమోనని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. ముందు గత ఎన్నికల్లో యూత్, మహిళా, రైతు డిక్లరేషన్(Farmers Declaration) పేరుతో ఏయే గ్యారంటీలు ఇచ్చారో దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అమలు చేసి చూపించాలని కిషన్​ రెడ్డి డిమాండ్ చేశారు.

Kishan Reddy On Babu Jagjivan Ram : బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ప్రజాస్వామ్య వాది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన స్పూర్తితోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు(Welfare Scheames) మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్​ అత్యన్నతమైన ఉపప్రధాని పదవిని అలంకరించారని తెలిపారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని బాబు జగ్జీవన్​ రామ్ సేవలను కొనియాడారు.

జగ్జీవన్ రామ్ ఆశయ స్పూర్తితోనే బీజేపీ పథకాలు : కిషన్ రెడ్డి
జనతా పార్టీ ఆయనని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ మాత్రం దళితుల్ని ప్రధాని కాకుండా అడ్డుకుందని కిషన్​ రెడ్డి విమర్శలు గుప్పించారు. విషప్రచారం చేసి ఆయనను ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన స్పూర్తితోనే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు.

డబుల్​ డిజిట్ సీట్లు గెలుపొందుతాం : కిషన్​రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి కాంగ్రెస్​పై కొద్ది రోజుల క్రితం విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే వస్తాయని స్పష్టం చేశారు.

'హామీలన్నీ అమలయ్యే దాకా కాంగ్రెస్​ను వదిలేది లేదు' - 'ప్రశ్నిస్తున్న తెలంగాణ' పోస్టర్, వెబ్​సైట్​ ఆవిష్కరణ

కాంగ్రెస్​ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయి : కిషన్‌ రెడ్డి

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి : కిషన్​రెడ్డి

Last Updated : Apr 5, 2024, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.