ETV Bharat / politics

బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదు : కిషన్ రెడ్డి - Kishan Reddy Fires On Congress - KISHAN REDDY FIRES ON CONGRESS

Kishan Reddy Fires On Congress : బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామనే అవాస్తవాలను కొందరు పదేపదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Kishan Reddy Fires On Congress
Kishan Reddy Fires On Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 6:32 PM IST

బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదు : కిషన్ రెడ్డి

Kishan Reddy Fires On Congress : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయవాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టార్గెట్-400 దిశగా కొనసాగుతున్న ఈసారి తెలంగాణలో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టి ఉత్సాహాం మీదున్న హస్తం పార్టీ మరోసారి తెలంగాణలో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటూ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తమపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. లోక్​సభ ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకు సానుకూలత లేదన్న కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టారు.

రుణమాఫీ అమలుకు పంద్రాగస్టు వరకు ఎందుకు? - గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ గారడీ చేస్తోంది : కిషన్​ రెడ్డి - Kishan Reddy on Election Campaign

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు : ఏ రంగంలో కూడా బీజేపీని తప్పు పట్టే అవకాశం లేదన్నారు కిషన్ రెడ్డి. తమ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలకు దిగుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఒక్క సాక్ష్యం చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.

"బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసింది హస్తం పార్టీయే. ఎస్సీగా ఉన్న రామ్​నాథ్ కోవింద్, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది బీజేపీ పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీ మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులుగా పని చేస్తున్నారు"- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy On Social Media Posts : సిద్దిపేటలో జరిగిన కేంద్రమంత్రి అమిత్​షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబేడ్కర్ ఆశయాలతోనే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీ అని ఆయన విమర్శించారు.

దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్‌ - బీజేపీని విమర్శించే నైతిక హక్కు హస్తం పార్టీకి లేదు : కిషన్‌ రెడ్డి - Kishan reddy Fire on Congress

దేశ, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది :​ కిషన్​రెడ్డి - BJP Manifesto 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.