Kishan Reddy Comments on CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కమలం పార్టీనేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగడుగునా నిలదీస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్ మాట్లాడారని, ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి హితవు పలికారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Kishan Reddy on Congress Guarantees : కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని అన్నారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారుని, ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. హామీలపై అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి సూచించారు.
Kishan Reddy on Voter List : అర్బన్ ప్రాంతాల్లో ఓటర్ల లిస్ట్‌ను సంస్కరించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ లిస్ట్‌ను సంస్కరించాలని గతంలో పలుమార్లు జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఒక్కొక్క నియోజకవర్గాల్లో దాదాపు 20 వేల ఓట్లు అధికారులు తొలగించారని ఆరోపించారు. దీనిపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.
బీజేపీ అనుకూలమైన ఓట్లు తొలిగించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. కొంత మంది వ్యక్తుల పేర్లు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని తెలిపారు. ఓటు నిర్ణయించడంలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేలా ఎన్నికల సంఘం ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు.
"రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది. బీఆర్ఎస్ ఇచ్చిన పథకాల అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఆగిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయా? లేవా? అనేది ప్రజలకు చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మానుకోవాలి."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు