ETV Bharat / politics

నేటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర - మిర్యాలగూడ నుంచి ప్రారంభం - KCR BUS Yatra In Telangana - KCR BUS YATRA IN TELANGANA

KCR Bus Yatra From Today In Telangana : బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి ఉద్ధృతం చేయనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభం కానున్న గులాబీ దళపతి యాత్ర వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటలో ముగియనుంది. 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి ఉదయం పూట రైతు సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి కర్షకుల కష్టనష్టాలు తెలుసుకోనున్న కేసీఆర్ సాయంత్రం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్ షోలలో ప్రసంగించనున్నారు.

KCR Election Campaign In Telangana
KCR BUS Yatra In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 7:17 AM IST

నేటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర - మిర్యాలగూడ నుంచి ప్రారంభం

KCR Bus Yatra In Telangana : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఇవాళ్టి నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. మిర్యాలగూడతో ప్రారంభించి లోక్ సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ నుంచి ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు.

KCR Election Campaign In Telangana : తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తర్వాత కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్న గులాబీ దళపతి సాయంత్రం అక్కడ రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజైన మే పదో తేదీన సిరిసిల్లలో రోడ్​ షో, సిద్దిపేటలో బహిరంగసభ నిర్వహించి ముగిస్తారు.

కేసీఆర్ రోడ్ షో : హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరగనున్నాయి. రోడ్‌ షోలలో భాగంగా ఉదయం సాగుదారుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ, రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. 17 రోజుల పాటు జరగనున్న బస్సుయాత్ర, అదీ వేసవి కావడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

'కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీతోనే ముప్పు - లోక్‌సభ ఎన్నికల తర్వాత తలెత్తే గందరగోళంతో బీఆర్ఎస్‌దే భవిష్యత్‌' - KCR REVIEW ON LOK SABHA ELECTIONS

మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర : ఆయన ప్రయాణించే బస్సును అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట వినియోగించుకునేందుకు వీలుగా చిన్న బస్సులనూ సిద్ధం చేశారు. యాత్రకు సంబంధించిన పలువురు నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. వారు బస్సు యాత్ర, రోడ్ షోకు సంబంధించిన అన్ని అంశాలను సమన్వయపరచి, పర్యవేక్షించనున్నారు. యాత్ర పొడవునా వంద మందికి పైగా వాలంటీర్లు సేవలు అందించనున్నారు. రక్షణ వ్యవస్థ కోసం బౌన్సర్లనూ ఉపయోగించుకోనున్నారు. మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్‌ సాయంత్రం నిర్వహించే రోడ్‌ షో కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారం నల్గొండ నుంచే ప్రారంభం కావడంపై కార్యకర్తల్లో జోష్‌ నెలకొంది.

మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సాయంత్రం సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వలేక పోతుంది. అప్పటి మా ప్రభుత్వం ఏదో ఒక విధంగా రైతులకు నీళ్లు ఇచ్చింది. - జగదీశ్​రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

మిర్యాలగూడలో మొదలై సిద్దిపేటలో ముగింపు - కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే - KCR Bus Yatra Schedule 2024

ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర - మిర్యాలగూడలో ప్రారంభం - KCR BUS YATRA SCHEDULE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.