Jyothi Rao Phule Birth Anniversary Celebration in Telangana : అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించిన మహాత్మ జ‌్యోతిరావు పూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగాయి. ఆలేరులో పూలే దంపతుల విగ్రహాలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పూలమాలలు సమర్పించి నివాళులర్పించగా ఖైరతాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పొన్నం, బీసీ భవన్, పూలే విగ్రహం పెట్టించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.
"మేము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపడతామన్నాము. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. మీ కులాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటే దానికి సంబంధించిన యువతకు కానీ, విద్యార్థుల భవిష్యత్‌కు మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటుంది." - పొన్నం ప్రభాకర్, మంత్రి
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ ఏమైనట్టు : కేటీఆర్ - KTR On Congress BC Declaration
KTR Tribute to Phule : తెలంగాణ భవన్‌లో పూలే చిత్రపటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 200 జయంతి లోపు సమున్నత జ్యోతిరావు పూలే విగ్రహాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సిద్దిపేటలోని నివాసంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసిన మాజీ మంత్రి హరీశ్ రావు ఆయన ఆశయాలు, కార్యాచరణ ఇప్పటికీ స్ఫూర్తిదాయకమేనని కొనియాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ తదితరులు నివాళులర్పించారు.
"బీసీ డిక్లరేషన్‌లో బీసీ సబ్‌ప్లాన్ పెడతాం. రూ.లక్ష కోట్లు కేటాయిస్తాం. దాంతో పాటు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అన్న మాట నిలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండలంలో బీసీలకు సకల సదుపాయాలతో, ఆధునిక పరిజ్ఞానంతో కూడిన గురుకులాలు నిర్మిస్తామని అన్నారు. దాన్ని కూడా పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా : మంత్రి పొన్నం
BJP Leaders Phule Birth Anniversary Celebrations : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలేకు నివాళులర్పించిన కమలం నేతలు ఆయన సేవలు కొనియాడారు. మహిళా విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నిజామాబాద్‌లో అభివర్ణించారు. ముషీరాబాద్‌లోని పలు డివిజన్లలోజరిగిన కార్యక్రమాల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ముల్కనూర్‌లోని ప్రజా గ్రంథాలయంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులాల పేరిట రాజకీయాలు చేస్తూ వివక్షతకు ప్రభుత్వాలు పునాదులు వేస్తున్నాయని పలువురు ఆక్షేపించారు.
సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించేలా కృషి చేస్తా : మంత్రి సీతక్క