ETV Bharat / politics

మోదీ హయాంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : జేపీ నడ్డా - JP Nadda Election Campaign - JP NADDA ELECTION CAMPAIGN

JP Nadda Election Campaign In Peddapalli : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లిలో పర్యటించారు. గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్​గా అభివృద్ది చెందుతుందని, ఫార్మా, పెట్రో, స్టీల్‌ ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం రెండో స్థానంలో ఉందని జేపీ నడ్డా తెలిపారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

JP Nadda Election Campaign
JP Nadda Election Campaign In peddapalli
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 3:10 PM IST

మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్​గా అభివృద్ది చెందుతుంది : జేపీ నడ్డా

JP Nadda Election Campaign In Peddapalli : మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్​గా అభివృద్ది చెందుతుందని ఫార్మా, పెట్రో, స్టీల్‌ ఉత్పత్తుల్లో దేశం ఇప్పటికే రెండో స్థానంలో ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉందని అన్నారు. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌కు మద్దతుగా జనజాతర సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. గతంలో మొబైళ్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని ప్రస్తుతం మేడిన్‌ ఇండియా ఫోన్లు వాడుతున్నామని పేర్కొన్నారు.

దేశంలో 56 వేల కి.మీ జాతీయ రహదారులు నిర్మించామని చెప్పారు. 52 వేల కి.మీ మేర రైల్వే విద్యుద్ధీకరణ చేశామన్నారు. విమానాశ్రయాల సంఖ్య 148కి పెంచామని పేర్కొన్నారు. లక్షలాది గ్రామాలకు అంతర్జాల సౌకర్యం కల్పించామని, దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నామని తెలిపారు. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని వెల్లడించారు. కానీ రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్​లోనే పెడతాం : అమిత్​షా - Amit Shah Campaign in Telangana

రాష్ట్రానికి వందేభారత్‌ రైలు సేవలు : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను కేసీఆర్‌ ఉపయోగించుకోలేదని ఇప్పుడు పీఎంఏవై పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఉపయోగించుకోవట్లేదని జేపీ నడ్డా మండిపడ్డారు. రాష్ట్రానికి మూడు వందేభారత్‌ రైలు సేవలు అందించామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫేక్‌ వీడియోను, ముఖ్యమంత్రి సైతం సర్క్యులేట్‌ చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

"మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్‌ అవుతుంది. ఫార్మా రంగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. గతంలో మొబైళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ప్రస్తుతం మేడిన్‌ ఇండియా ఫోన్లు వాడుతున్నాం. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించాం. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు. కేసీఆర్‌ హామీ ఇచ్చిన 2 పడక గదుల ఇళ్లను మేం పూర్తిచేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను కేసీఆర్‌ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు పీఎంఏవై పథకాన్ని రేవంత్‌రెడ్డి కూడా ఉపయోగించుకోవట్లేదు." -జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కాపాడుతుంది : అమిత్ షా - Amit Shah Secunderabad Meeting

బీజేపీ హయాంలో పాకిస్థాన్ తోక కత్తిరించాం - దేశంలో శాంతి కావాలంటే మోదీ రావాలి : కిషన్‌రెడ్డి - Kishan Reddy Election Campaign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.