Jharkhand MLAs in Hyderabad : హైదరాబాద్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రత మధ్య శిబిరంలో సురక్షితంగా ఉంచారు. శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో 36 మంది ఉన్నారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసనసభలో 41 మంది మెజార్టీ ఉంటే వారిదే అధికారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎం మూడింటికి కూడా తగినంత మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న జేఎంఎం పార్టీతో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
మాజీ సీఎం అరెస్ట్‌పై విచారణకు సుప్రీం నో- హేమంత్ సోరెన్‌కు 5రోజుల రిమాండ్
Jharkhand MLAs Camp in Hyderabad : ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (Hemant Soren) కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన రాంచీ నగరంలో దాదాపు 12 ప్రాంతాల్లో 8.5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి హోదాలో తనపై కేసు నమోదు కావడంతో ఆయన రాజీనామా చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు, హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఝార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైన కూడా కొన్ని గంటల పాటు సందిగ్ధం నెలకొంది. చివరకు చంపయీ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నుంచి నిర్ణయం వెలువడింది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం చంపయీ సోరెన్ (Champai Soren)తో గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు. చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభ్యుల బలం నిరూపించేందుకు గవర్నర్ పది రోజులు గడువు ఇచ్చారు.
హైదరాబాద్‌కు చేరిన ఝార్ఖండ్ రాజకీయం - రిసార్టులో 36 మంది ఎమ్మెల్యేలు
Jharkhand Political Crisis Latest Updates : దీంతో జేఎంఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమవైపు తిప్పుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తుందో అన్న అనుమానంతో వారిని కాపాడుకునేందకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రెండు పార్టీల ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ఏఐసీసీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను శామీర్‌పేటలోని లియోనియో రిసార్ట్స్‌లో ఉంచారు.
మరోవైపు శిబిరం వద్ద దాదాపు 300 మంది పోలీసులను మోహరించినట్లు తెలిసింది. అనుమతి లేకుండా స్థానిక కాంగ్రెస్ నేతలను కూడా శిబిరంలోకి అనుమతించ వద్దని పోలీసులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలోనే మీడియాను దరిదాపులకు కూడా రానివ్వడం లేదు. ఈ నెల 5న బలపరీక్ష ఉండటంతో ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం కానీ హైదరాబాద్ శిబిరంలో ఉన్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి వెళ్తారని హస్తం పార్టీ నాయకులు తెలిపారు.
ఝార్ఖండ్‌లో వీడిన ఉత్కంఠ- సీఎంగా చంపయీ సోరెన్, 10 రోజుల్లో బలపరీక్ష
ఝార్ఖండ్ సీఎం సోరెన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం- 7గంటలకుపైగా విచారణ