Pawan Kalyan Cars : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుగా నామినేషన్ దాఖలు చేయాల్సిందే. తమపై నమోదైన కేసులు, ఆస్తుల పూర్తి వివరాలను అందులో వెల్లడించాల్సిందే. ఈ నేపథ్యంలో రూ.వేల కోట్లు కలిగిన పలువురు అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలిసి ఓటర్లు అవాక్కవుతున్నారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల కమిషన్కు నివేదించారు.
పవన్ వద్ద మొత్తం 11 వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి బైక్, మరొకటి పికప్ ట్రక్, మరో 9 కార్లు ఉన్నాయి. పవన్ 2010 సంవత్సరంలో హార్లే డేవిడ్ సన్ బైక్ను కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ బైక్ ధర రూ.32 లక్షల 66 వేల 536. ఆ తర్వాత 2011లో పవన్ ఆర్ క్లాస్ 360 మోడల్ బెంజ్ కారు కొన్నారు. దాని ధర రూ.72 లక్షల 95 వేల 264. ఇక 2014లో మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్8 మోడల్ స్కార్పియోను రూ.13 లక్షల 82 వేల 240లకు కొనుగోలు చేశారు. 2021లో టాటా యోధా పికప్ ట్రక్ తీసుకున్నారు. ఆ వాహనం ధర రూ.9 లక్షల 19 వేల 098. పవన్ వద్ద ఉన్న వాహనాల్లో అతి తక్కువ ధర దీనిదే కావడం గమనార్హం.
Jana Sena Party President Pawan Kalyan Income : 2021లో ఎస్ క్లాస్ 560 మోడల్ బెంజ్ కారును రూ. 2 కోట్ల 42 లక్షల 06 వేల 101లకు పవన్ కొనుగోలు చేశారు. 2022లో రేంజ్ రోవర్ స్పోర్స్ట్ కారును రూ.5 కోట్ల 47 లక్షల 3 వేల 87లకు కొనుగోలు చేశారు. పవన్ కొనుగోలు చేసిన వాహనాల్లో ఇదే అత్యధిక విలువైనది కావడం విశేషం. 2022 సంవత్సరంలో పవన్ కల్యాణ్ 6 కార్లు కొన్నారు. అందులో మొదటిది రూ.2 కోట్ల 53 లక్షల 70 వేల 879 వెచ్చించి టయోటా కంపెనీ ల్యాండ్ క్రూజర్, టయోటా కంపెనీకి చెందిన వెల్ఫేర్ కారును రూ.కోటీ 11 లక్షల 88 వేల 854 పెట్టి కొన్నారు.
రూ.71 లక్షల 54 వేల 46 విలువైన జీప్ వ్రాంగ్లర్ కారును, తర్వాత మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో ఎస్ 11 మోడల్ కార్లు మరో రెండింటిని పవన్ కొనుగోలు చేశారు. ఒక్కో దాని విలువ రూ.23 లక్షల 49 వేల 648గా పవన్ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. మొత్తంగా ఆయన వద్ద ఒక బైక్, పికప్ ట్రక్, 9 కార్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.14 కోట్ల 01 లక్షా 85 వేల 401.
సీఎం జగన్కు దెబ్బతగిలితే ఏపీకీ గాయమైనట్లా? : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Speech at Tenali